సన్‌ రైజర్స్‌ మళ్లీ ట్రాక్ ఎక్కింది .. పంజాబ్‌పై ఘనవిజయం

ఐపీఎల్ 13 వ సీజన్ లో దుబాయ్ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తో జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 69 పరుగులతో ఘన విజయం నమోదు చేసింది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ నిర్ధేశించిన 202 పరుగుల టార్గెట్ ‌ను పంజాబ్ చేధించలేక ఛతికేలపడింది.

ఆరంభంలో నే ఆ జట్టు తడబడింది.రెండో ఓవర్లలోనే పంజాబ్‌ తొలి వికెట్‌ చేజార్చుకుంది.1.3వ బంతికి రెండో పరుగు తీస్తూ డేవిడ్ వార్నర్ సూపర్ ఫీల్డింగ్‌ కు, మయాంక్‌ (9; 6 బంతుల్లో 1×4) రనౌట్‌ అయ్యాడు.4 ఓవర్లలో పంజాబ్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది.ఖలీల్‌ బౌలింగ్‌లో సిమ్రన్‌ సింగ్‌ (11; 8 బంతుల్లో 2×4) ప్రియమ్‌ గార్గ్ ‌‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

అదుకుంటాడు అనుకున్న కేల్ రాహుల్‌ను అభిషక్ శర్మ దొరకబుచ్చుకున్నాడు.ఓ వైపు వికెట్లు పడుతున్న నికోలస్‌ పూరన్‌(77; 37 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు)‌ దాటిగా ఆడాడు.

ఆ తర్వాత సన్ ‌రైజర్స్ బౌలింగ్ కొంచెం గాడి తప్పింది.అబ్దుల్‌ సమద్‌ ఒక్క ఓవర్ల 28 పరుగులు ఇచ్చాడు.అతను‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్‌ కొట్టాడు పూరన్ .ఈ సీజన్‌ ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీని కూడా నమోదు చేశాడు.ఆ తర్వాత మళ్ళీ బౌలర్లు పుంజుకోవడంతో సంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయి 132పరుగులకు అలౌటైంది.

Advertisement

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.ఓపెనర్స్ దుమ్ములేపారు.

వార్నర్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్థ శతకం సాధించగా, మరో ఓపెనర్ బెయిర్‌ స్టో(97; 55 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) కాస్తలో సెంచరీ మిస్‌య్యాడు.ఓపెనర్లు దాటిగా ఆడి పరుగుల వరద పారించారు.

ఆరంభంలో తేలిపోయిన పంజాబ్ బౌలర్లు.చివరలో పుంజుకున్నారు.

తాజా వార్తలు