తప్పులో కాలేసిన సునిల్

ఎవరికీ దక్కాల్సింది వాళ్ళకే దక్కుతుందనేది నానుడి .నిజమే ఏమో అనిపిస్తుంది సినిమా వాళ్ళని చుస్తే .

కామేడియన్ లో మంచి ఊపులో ఉండగా హీరోగా మారాడు సునీల్ .దానితోనే కామేడియన్ గా సునీల్ మళ్ళి కనిపించలేదు.తనకి వంటబట్టిన కామేడితోనే సరిపెట్టుకోకుండా యాక్షన్,సిక్స్ ప్యాక్స్ అంటూ నానా తంటాలు పడ్డాడు సునీల్ .వాటి మీద ఉన్న యావతోనే బంగారం లాంటి అవకాశాన్ని వదులుకున్నాడు.నాని రేంజ్ ని పెంచిన భలే భలే మొగాడివోయ్ మొదట వెళ్ళింది సునీల్ దగ్గరకి.

దర్శకుడు మారుతి సునీల్ ఈ కథకు సరైనోడు అని భావించి వెళితే .కథ అంతా బాగుంది .బాగా నవ్వుకుంటారు ప్రేక్షకులు .కాని నాకు ఇందులో ఫైట్స్ కావాలి.యాక్షన్ ఎలిమెంట్స్ కావలి .అలా ఉంటేనే చేస్తాను అని తిరకాసు పెట్టాడట .దానితో మారుతి హీరో ని మార్చాడు కాని కథ లో లేనిపోనివి జోప్పించలేదు.ఇదే సినిమా సునీల్ చేసుంటే కలెక్షన్లు ఇంతకన్నా ఎక్కువే వచ్చేవి .చాలా కాలంగా సక్సెస్ ట్రాక్ లో లేని సునీల్ కి బంపర్ హిట్ దక్కేది .ఏది ఎవరికీ దక్కాలో వారికే దక్కద్ది .నాని ఈ సక్సెస్ కి అన్ని విధాలా అర్హుడు !.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
Advertisement