'భక్త కన్నప్ప'లో ఆ సీనియర్ హీరో.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియన్ లెవల్లో తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో భక్త కన్నప్ప ( Bhakta Kannappa ) ఒకటి.

టాలీవుడ్ హీరోల్లో ఒకరైన మంచు విష్ణు వరుస ప్లాప్స్ తర్వాత కొద్దీ గ్యాప్ తో నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.కన్నప్ప భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా న్యూజిలాండ్ లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంటుంది.

ఇటీవలే మంచు విష్ణు పుట్టిన రోజున ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి మరింత హోప్స్ పెంచేశారు.ఈ ఫస్ట్ లుక్ తో ఆడియెన్స్ లో ఈ సినిమాపై మంచి ఆసక్తి కలిగేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.ముఖేష్ కుమార్ సింగ్( Mukesh Kumar Singh )ఈ సినిమాను డైరెక్టర్ చేస్తుండగా మంచు మోహన్ బాబు ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇక మణిరత్నం, స్టీఫెన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.అయితే తాజాగా మరో స్టార్ హీరో ఈ సినిమాలో భాగం అయినట్టు తెలుస్తుంది.

Advertisement

ఆయన ఎవరో కాదు.బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించబోతున్నారట.

ఇప్పటికే సునీల్ శెట్టి( Suniel Shetty ) మోసగాళ్లు సినిమాలో నటించడంతో వీరి మధ్య ఉన్న సన్నిహితం కారణంగా ఈ సినిమాలో అతిథి రోల్ చేసేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.ఇందులో ఈయన కీలక పాత్ర చేస్తున్నట్టు టాక్.కాగా ఆదివాసీ తెగకు చెందిన ఒక రోల్ లో మోహన్ లాల్ నటిస్తుండగా.

మహా శివుడిగా ప్రభాస్, పార్వతి దేవిగా నయనతార కనిపించనున్నట్టు సమాచారం.ఇంకా చాలా మంది స్టార్స్ భాగం కాబోతున్నట్టు తెలుస్తుంది.

మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement

తాజా వార్తలు