అండర్ ఆర్మ్స్‌లో డార్క్‌నెస్‌ను ఈజీగా తొల‌గించే సన్‌ఫ్లవర్ ఆయిల్..ఎలాగంటే?

రోజూ వారీ వంట‌ల‌కు చాలా మంది స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌(పొద్దు తిరుగుడు నూనె)ను వాడుతుంటారు.స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఎన్నో జ‌బ్బుల నుంచి ర‌క్షిస్తుంది.అందుకే ధ‌ర ఎంతైనా వంట‌ల‌కు స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌నే ఎంచుకుంటారు.

అయితే ఆరోగ్యానికే కాదు చ‌ర్మ సౌంద‌ర్యానికీ స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్ ఉప‌యోగ‌ప‌డుతుంది.అవును, ఈ ఆయిల్‌లో ఉండే న్యూట్రీషియన్స్ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేయ‌డ‌మే కాదు.

ప‌లు ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను సైతం నివారిస్తాయి.ముఖ్యంగా డార్క్ అండ‌ర్ ఆర్మ్స్‌తో స‌త‌మ‌తం అవుతున్న వారికి స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్ సూప‌ర్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement
Sunflower Oil Help To Remove Darkness In Underarms! Sunflower Oil, Dark Underarm

అవును, అండ‌ర్ ఆర్మ్స్‌లో ఏర్ప‌డిన డార్క్ నెస్‌ను స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్ చాలా ఈజీగా తొల‌గించ‌గ‌ల‌దు.మ‌రి ఇంకెందుకు లేటు స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌ను ఎలా యూజ్ చేయాలో ఓ లుక్కేసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్, నాలుగు టేబుల్ స్పూన్ల‌ బేకింగ్ సోడా వేసి క‌ల‌పాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని అండ‌ర్ ఆర్మ్స్‌లో ప‌ట్టించి ఐదు నిమిషాల పాటు వ‌దిలేయాలి.

ఇప్పుడు ఆ ప్లేస్‌లో ఒక నిమ్మ చెక్క తీసుకుని.స్మూత్‌గా స్క్ర‌బ్ చేసుకోవాలి.

మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు స్క్ర‌బ్బింగ్ చేసుకుని.ఆపై కూల్ వాట‌ర్‌తో శుభ్రంగా వాస్ చేసి మాయిశ్చ‌రైజ‌ర్ రాసుకోవాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 23 బుధవారం, 2020

ఇలా రోజుకు ఒక సారి చేస్తే గ‌నుక కేవ‌లం కొద్ది రోజుల్లోనే అండర్ ఆర్మ్స్‌లో డార్క్ నెస్ తొల‌గి పోయి అక్క‌డి చ‌ర్మం తెల్ల‌గా మ‌రియు మృదువుగా మారుతుంది.

Sunflower Oil Help To Remove Darkness In Underarms Sunflower Oil, Dark Underarm
Advertisement

ఇక స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌తో మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.రోజూ స్నానం చేసే నీటిలో రెండు స్పూన్లు ఈ ఆయిల్‌ను క‌లిపి బాత్ చేస్తే.స్కిన్ డ్రైగా మార‌కుండా ఉంటుంది.

మ‌రియు ముడ‌త‌లు, మ‌చ్చ‌లు కూడా చ‌ర్మంపై ఏర్ప‌డ‌కుండా ఉంటాయి.

తాజా వార్తలు