'మైఖేల్'తో దళపతి.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్!

టాలీవుడ్ లో యంగ్ హీరోలు చాలా మందే ఉన్నారు.వారిలో సందీప్ కిషన్ ఒకరు.

ఈయన చిన్న చిన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించు కున్నాడు.ఇక సందీప్ కిషన్ మొదటిసారిగా చేస్తున్న పాన్ ఇండియన్ మూవీ మైఖేల్.

ఈ సినిమా ఫిబ్రవరి 3న గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.

ఈ సినిమాపై సందీప్ కిషన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.అందుకే ప్రమోషన్స్ కూడా బాగా చేస్తూ ఈ సినిమాను వీలైనంత వరకు ప్రేక్షకులకు చేరువ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాను రంజిత్ జయకోడి డైరెక్ట్ చేయగా దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించింది.

Advertisement

యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ చేసుకుంది.ఇదిలా ఉండగా తాజాగా సందీప్ కిషన్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతిని కలిసాడు.

రేపు తన సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో విజయ్ ను నేరుగా కలిశారు.ఈ విషయాన్నీ పిక్ షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా సందీప్ కిషన్ పంచుకున్నాడు.మైఖేల్ సినిమా విషయంలో స్టార్ హీరో విజయ్ చేసిన వ్యాఖ్యలకు.

ప్రేమకు.మద్దతుకు.

సందీప్ కిషన్ ఆనందం వ్యక్తం చేసాడు.ఇక ఈయన షేర్ చేసిన ఈ పిక్ నెట్టింట కొద్దీ నిముషాల్లోనే వైరల్ అయ్యింది.

లిచి పండ్లలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?

ఇక మైఖేల్ సినిమాలో విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్ ఇంకా గౌతమ్ వాసుదేవ్ మీనన్ లు కీలక పాత్రల్లో నటించగా.కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి సహకారంతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి నిర్మించిన ఈ సినిమాకు సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలంటే రేపు ఈ సమయం వరకు వేచి ఉండాల్సిందే.

తాజా వార్తలు