Actor Suman: ఆ హీరోల కూతుళ్ళ గురించి ఏ రోజు చెప్పుకోలేదు : సుమన్

హీరో సుమన్.( Hero Suman ) సినిమా ఇండస్ట్రీలో ఒక స్థాయిలో సెటిల్ అయిన తర్వాత సగటు మానవుడు కూడా పడనన్ని కష్టాలు పట్టాడు.

జైల్లో మగ్గాడు. తల్లి సహకారంతో ఏళ్ల పాటు పోరాటం చేశాడు.

తిరిగి మళ్లీ ఇండస్ట్రీకి వచ్చి తానేంటో నిరూపించుకున్నాడు.తాను నిర్దోషిని అని ప్రపంచానికి చాటి చెప్పాడు కానీ ఈలోపు ఎన్నో అవమానాలకు గురయ్యాడు.

ఎంతో సహనంతో అన్నీ భరించాడు.సినిమా ఇండస్ట్రీ నుంచి సుమన్ కష్టకాలంలో ఉన్న సమయంలో ఎవ్వరూ కూడా ఆయనకు సహాయం చేయలేదు ఏ ఒక్క హీరో సుమన్ మంచివాడు అంటూ ప్రకటన ఇవ్వలేదు కానీ భానుప్రియ, సుహాసిని, సుమలత వంటి హీరోయిన్స్ అప్పట్లో పత్రిక ముఖంగా సుమన్ యొక్క గొప్పతనం వర్ణిస్తూ ఇంటర్వ్యూ ఇచ్చారు.

Advertisement

ఇన్ని జరిగిన తాను ఎవరి పేరు చెప్పలేదు ఎవరి గురించి అడగలేదు ఎవరి గొప్పతనం కూడా వాడుకోలేదు ఫలానా వారు నాకు తెలుసు అని ఎక్కడ నోరు విప్పి చెప్పలేదు.అందుకే సుమన్ అంటే అందరికీ గౌరవం.తనతో నటించిన హీరోయిన్స్ అంతా ఏకమై సుమన్ విడుదలకు ఎంతో ప్రయత్నం చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు అతడి ప్రవర్తన ఎంత గొప్పదో.

ఇక సినిమాల్లో అప్కమింగ్ హీరో గా ఉన్న సమయంలోనే శోభన్ బాబు( Sobhan Babu ) కూతురు మృదుల( Mrudula ) అతడి తల్లి దగ్గర స్టూడెంట్ గా ఉండేది.దోషి నిర్దోషి( Doshi Nirdoshi Movie ) అనే సినిమా లో శోభన్ బాబు మరియు సుమన్ కలిసిన నటించారు.

అయినా కూడా ఒకసారి కూడా మీ కూతురు మా అమ్మకు స్టూడెంట్ అని చెప్పుకోలేదట.ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నాను అని చెప్పారు హీరో సుమన్.

ఇక కృష్ణ కూతురు కూడా సుమన్ తల్లి దగ్గరే చదువుకుందట.అయినా కూడా కృష్ణతో కలిసి నటించిన సమయంలో ఏ రోజు ఆ విషయం ఆయనకు చెప్పలేదట సుమన్.ఇలా ఎంతో అనుకువగా ఉండే సుమన్ దాదాపు మూడు నుంచి నాలుగు వేల పాటు కష్టాలు పడ్డాడు ఆ తర్వాత అంత సర్దుకుపోయింది ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటిస్తూ సుమన్ ఆర్థికంగా బాగానే సెటిల్ అయ్యాడు.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?

తన తర్వాత వారసత్వం ఎవరిని కూడా ఇండస్ట్రీకి పంపించలేదు.

Advertisement

తాజా వార్తలు