తెలుగు ప్రేక్షకులకు లేడీ యాంకర్ సుమ కనకాల (suma kanakala)గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
తెలుగులో ఎన్నో షో యాంకర్ గా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
టీవీ షోలలో తన యాంకరింగ్ తో తెలుగువారిళ్ళల్లో ఒకరిగా అయిపొయింది యాంకర్ సుమ కనకాల.టీవీ షో లతో పాటు పండుగ ఈవెంట్లు, సినిమా టీజర్ ఈవెంట్ టు లాంచ్ ఈవెంట్లు ప్రమోషన్స్ లో ఇలా ఎక్కడ చూసినా కూడా సుమా పేరే వినిపిస్తూ ఉంటుంది.
తన మాటలతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటుంది సుమ.ఇటీవలే యూట్యూబ్(youtube) ఛానల్ ని కూడా మొదలుపెట్టిన సుమా కనకాల యూట్యూబ్ ద్వారా కూడా ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ ఉంటుంది.ఇకపోతే సుమ ప్రస్తుతం పలు టీవీ షోలు( TV Shows), సినిమా ఈవెంట్లు(Movie Events), యూట్యూబ్ వీడియోలతో బిజీగా ఉంది.
సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది.యాంకర్ సుమ గతంలో కూడా పలు మార్లు వాళ్ళ అమ్మ గురించి ఫొటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.
గతంలో కూడా సుమ వాళ్ళ అమ్మ జిమ్ చేసిన వీడియోలు షేర్ చేసింది.
తాజాగా యాంకర్ సుమ వాళ్ళ అమ్మ ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియో షేర్ చేసింది.ఈ వీడియోలో సుమ తల్లి ఇంట్లోనే ఎక్సర్ సైజ్ లు చేస్తూ, సైక్లింగ్ చేస్తూ, చిన్న చిన్న బరువులు ఎత్తుతూ ఉంది.దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూసి 82 ఏళ్ళు దాటినా ఇంకా ఆమె ఇలా చేస్తున్నారంటే గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.ఈ వయసులో అంతలా కష్టపడడం అన్నది మామూలు విషయం కాదు నిజంగా చాలా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy