సుమ నేను నిన్ను చూడను తల్లి... యాంకర్ సుమకు కౌంటర్ ఇచ్చిన ఎన్టీఆర్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఒకరు.

ఇక ఈయన నటించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా మారిపోయారు.

నాటు నాటు పాటకు గాను ఆస్కార్ (Oscar)అవార్డు రావడంతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగిపోయింది.ఇక ఈ అవార్డు అందుకున్న తర్వాత ఎన్టీఆర్ మొదటిసారిగా హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన దాస్ కా ధమ్కీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ యాంకర్ సుమ(Suma) మధ్య ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది.

ఎన్టీఆర్ఇదివరకు తన అన్నయ్య కళ్యాణ్ రామ్(Kalyan ram) హీరోగా నటించిన అమిగోస్ సినిమా వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అయితే ఈ వేడుకలో భాగంగా యాంకర్ సుమ మాట్లాడుతూ ఎన్టీఆర్ 30(NTR 30) సినిమా గురించి అప్డేట్ ఇవ్వాలి అంటూ మాట్లాడటంతో వెంటనే ఎన్టీఆర్ వాళ్ళు అడగకపోయినా నువ్వే అడిగించేలా ఉన్నావు అంటూ సుమ వైపు చాలా సీరియస్ గా చూశారు.అయితే ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Advertisement

తారక్ అలా తనపై సీరియస్ అవడంతో సుమ కనకాల ఏడ్చారు అంటూ వార్తలు కూడా వచ్చాయి.

తాజాగా విశ్వక్ సినిమా వేడుకకు ముఖ్యఅతిథిగా పాల్గొన్నటువంటి ఎన్టీఆర్ ను సుమా వేదికపైకి ఆహ్వానించగా ఎన్టీఆర్ కింద నుంచి కూర్చొని తన వైపు చూడను అంటూ సైగలు చేశారు.ఇలా ఎన్టీఆర్ సైగలు చేయడంతో సుమా చూడు తారక్ నా వైపు చూడు అంటూ మాట్లాడింది.ఇలా వీరిద్దరి మధ్య ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకోవడంతో ఎన్టీఆర్ సుమకు కౌంటర్ ఇచ్చారు అంటూ పలువురు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సుమ భర్త రాజీవ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసింది.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు