అఖిల్‌కు ప్రేమతో..!

అఖిల్‌ రెండవ సినిమాకు ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్న కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ నిన్న మొన్న సినీ వర్గాల్లో ప్రచారం జరిగిన విషయం తెల్సిందే.

ప్రస్తుతం కళ్యాణ్‌ కృష్ణ అందుకోసం స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడని కూడా వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత ప్రస్తుతం నాగార్జునతో ‘ఊపురి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వంశీ పైడిపల్లి కూడా అఖిల్‌ కోసం స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.తాజాగా మరో ఆసక్తికర వార్త ఒకటి ఫిల్మ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

అఖిల్‌ కోసం నాగార్జున ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ను ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పర్చుకున్న దర్శకుడు సుకుమార్‌.

Advertisement

ఈయన తాజాగా ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యి, 50 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తన కొడుకు రెండవ సినిమాను సుకుమార్‌ దర్శకత్వంలో చేయాలని నాగార్జున భావిస్తున్నాడు.అందుకోసం సుకుమార్‌తో సంప్రదింపులు సైతం జరుపుతున్నట్లుగా చెబుతున్నారు.

కాని ఇప్పటికే సుకుమార్‌ తర్వాత సినిమా దేవిశ్రీ ప్రసాద్‌ హీరోగా ఖరారు అయ్యింది.ఈ నేపథ్యంలో అఖిల్‌ ఆ సినిమా పూర్తి అయ్యే వరకు ఉంటాడా లేక మరో దర్శకుడితో తన రెండవ సినిమాను అఖిల్‌ కానిచ్చేస్తాడా అనేది చూడాలి.

Karamba Review And Player Reputation — A Practical UK Guide
Advertisement