ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ బేబీ.
ఈ మూవీ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.
ఎందుకంటే ఇది లవ్ స్టోరీ కావడం హీరోయిన్ బోల్డ్ రోల్ కావడంతో ఈ సినిమా కుర్రాళ్లకు మరింతగా నచ్చేసింది.ఈ సినిమా ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకోగా ఇప్పుడు మరింత మంచి టాక్ తో దూసుకు పోతుంది.
ఇక ఈ సినిమాను కలర్ ఫోటో లాంటి అందమైన సినిమాకు కథ ఇచ్చిన ప్రముఖ రచయిత దర్శకుడు సాయి రాజేష్( Sai rajesh ) తెరకెక్కించాడు.జులై 14న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీగా నిలిచింది.
ఇక ఈ సినిమాపై చాలా మంది ప్రముఖులు ఇప్పటికే ప్రశంసలు కురిపించారు.ఇక తాజాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా బేబీ సినిమా( Baby movie )పై ప్రశంసలు కురిపించారు.
ఈయన పోస్ట్ చేస్తూ.ఈ సూపర్ హిట్ సినిమా చూడడానికి ఇన్ని రోజులకు సమయం దొరికింది అని సినిమా చూసిన తర్వాత ఇలాంటి అసాధారణమైన రచనలను చూసి చాలా కాలం అయ్యిందంటూ తెలిపారు.ఇది ఒక కొత్త వేవ్ అని కొత్త నమూనాను తీసుకు వచ్చింది.
ప్రతి సన్నివేశం సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంది.ఇటువంటి సినిమాను నిర్మించినందుకు సాయి రాజేష్ గారికి వందనాలు.
అలాగే నిర్మాతలను కూడా నేను అభినందిస్తున్నాను.వైష్ణవి( Vaishnavi chaitanya ) నటించిన పాత్ర ఇప్పటి వరకు అత్యంత ప్రసిద్ధ చెందిన పాత్రలలో ఒకటి.ఆనంద్, విరాజ్, వైష్ణవి నటన ఎంతో ఆకట్టుకుంది.
ఈ సినిమా సూపర్ హిట్ అందుకున్నందుకు టీమ్ మొత్తానికి నా అభినందనలు అంటూ ఈయన ఇచ్చిన రివ్యూ నెట్టింట వైరల్ అవుతుంది.ఇలాంటి స్టార్ డైరెక్టర్ చేత కూడా ప్రశంసలు అందుకుని బేబీ సినిమా మరో పెట్టు పైకి ఎక్కింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy