పుష్పలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మ

సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో మూడో సినిమాకి రంగం సిద్ధమైంది.

సుకుమార్ గత సినిమాల తరహాలో స్టైలిష్ గా కాకుండా రంగస్థలం తరహాలో పక్కా మాస్ యాంగిల్ లో ఈ సారి బన్నీని చూపించబోతున్నాడు.

ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసి సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయంపై సుకుమార్ క్లారిటీ ఇచ్చేశాడు.చిత్తూరు నేపధ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలిమెంట్ తో ఈ కథ ఉండబోతుంది అని తెలుస్తుంది.

పుష్ప టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర పేరు పుష్పరాజ్ అని సుకుమార్ డిసైడ్ చేశాడు.రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ కి సాలిడ్ హిట్ ఇచ్చిన సుకుమార్ అంతకు ముందు క్లాస్ యాంగిల్ చూపించి ఒక్కసారిగా తనలోనే మాస్ మసాలా దర్శకుడుని పరిచయం చేసాడు.

ఈ సారి కూడా పుష్పరాజ్ తో మరో మాస్ ఎంటర్టైన్మెంట్ తో ఆవిష్కరించబోతున్నాడు.ఇదిలా ఉంటే రంగస్థలంలో జిగేలు రాణి తరహాలోనే ఇందులో చిత్తూరు యాసలో సాగే ఒక మాస్ బీట్ ని సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Advertisement

ఇక ఈ సాంగ్ ని ఫోక్ గాయకుడు పెంచల్ దాస్ తో రాయించబోతున్నారని సమాచారం.అలాగే ఈ సాంగ్ కోసం పూజా హెగ్డే తరహాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దించబోతున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే ఒక ఇద్దరు పేర్లు పరిశీలించినట్లు టాక్ నడుస్తుంది.మరి వారిలో ఎవరిని సుకుమార్ ఫైనల్ చేస్తాడు అనేది వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు