ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్నది ఎవరినో గుర్తు పట్టండి చూద్దాం...

తెలుగులో ప్రముఖ దర్శకుడు ఏ.కోదండ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన "పసివాడి ప్రాణం" చిత్రం ఇప్పటికీ చాలా మంది సినీ అభిమానులకు తమ ఫేవరెట్ చిత్రాల లిస్టులో ఉంటుంది.

ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేడీ సూపర్ స్టార్ విజయశాంతిలు నటించారు.కాగా సుమలత, బ్రహ్మానందం, స్వర్గీయ నటుడు రఘువరన్, అల్లూరి రామలింగయ్య తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

Sujitha, Telugu Actress, Child Artist , Pasivadi Pranam Movie, Chiranjeevi-ఈ �

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.ఇంతకీ ఆ విషయం ఏంటంటే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి బుడ్డోడిని ఎత్తుకొని దిగినటువంటి పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ హల్చల్ చేస్తోంది.

అయితే ఆ పోస్టర్ లో కనిపిస్తున్నది అందరి లాగే మీరు కూడా బుడ్డోడనుకుంటే పప్పులో కాలేసినట్లే.అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది తెలుగు నటి సుజిత.

Advertisement

ఈమె చిన్నప్పుడు పసివాడి ప్రాణం చిత్రంలో చిన్న బాలుడి  పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.కాగా ఈమె పెద్దయిన తర్వాత కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించినటువంటి జై చిరంజీవ అనే చిత్రంలో తన చెల్లెలి పాత్రలో కూడా నటించింది.

అలాగే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం తదితర భాషలలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి బాగా మెప్పించింది.మరోవైపు టెలివిజన్ రంగంలో కూడా బాగానే రాణించింది.

ఇప్పటికీ నటి సుజితను చాలా మంది ప్రేక్షకులు  తమ కుటుంబ సభ్యురాలిగా చూస్తుంటారు.

బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు
Advertisement

తాజా వార్తలు