పవన్ తన కొడుకుకు అకీరా అని అందుకే పేరు పెట్టారు.. సుజీత్ కామెంట్స్ వైరల్!

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా( OG movie ) గురించి మనందరికీ తెలిసిందే.

ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అని అర్థం అన్న విషయం తెలిసిందే.

కాబట్టి పవన్ కల్యాణ్ తో చేస్తున్న సినిమాకు ఆ టైటిల్ పెట్టి ఉంటారని అంతా అనుకుంటున్నారు.అయితే ఓజీ అనే టైటిల్ ఆ ఉద్దేశంతో పెట్టలేదట.

దానికి వేరె అర్థం ఉంది అంటున్నారు డైరెక్టర్ సుజీత్.ఓజీ అంటే ఓజాస్ గంభీర్( Ojas Gambhir ) అని అర్థం.

సినిమాలో ఓజాస్ అంటే మాస్టర్ పేరు, గంభీర్ అంటే హీరో పేరు.

Advertisement

రెండూ కలిపితే ఓజీ అని వస్తుంది.అందుకే ఆ టైటిల్ పెట్టాము అని తెలిపారు.పవన్ ఎప్పుడూ తన సినిమాల్లో కథతో సంబంధం లేకపోయినా జపాన్( Japan ) ఫ్లేవర్ చూపించే ప్రయత్నం చేస్తుంటారు.

అందుకే ఆయనతో జపాన్ స్టయిల్ లో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ఫిక్స్ అయ్యాను.అదే ఓజీ సినిమా అని చెప్పుకొచ్చారు సుజీత్.అనంతరం ఆయన మాట్లాడుతూ.

నాకు జపాన్ చిత్రాలంటే చాలా ఇష్టం.అలాగే పవన్ కు కూడా జపాన్ మూవీస్ అంటే చాలా ఇష్టం.

అందుకే తన కొడుక్కి అకిరా( Akira ) అని పేరు కూడా పెట్టారు అని తెలిపారు సుజీత్.ఓజీ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ట్రయిలర్ కూడా రెడీ అయిపోయిందని ప్రకటించాడు.ఈ సందర్భంగా సుజీత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

ఇకపోతే పవన్ కళ్యాణ్ ఓ జీ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు