ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో సుహాస్.. అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారా?

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్( Suhas ) గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో చాలా సినిమాలలో నటించిన హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుహాస్.

సుహాస్ నటించిన చాలా సినిమాలు కూడా తెలుగులో మంచి సక్సెస్ గా నిలిచాయి.సుహాస్ నటించిన సినిమాలో వరుసగా సక్సెస్ అవుతుండడంతో దర్శక నిర్మాతలు కూడా సుహాస్తో సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

తక్కువ టైంలోనే బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు.బాగా గుర్తింపు తెచ్చిన సినిమా అంటే కలర్ ఫోటో అని చెప్పాలి.

ఇది ఇలా ఉంటే తాజాగా హీరో సుహాస్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.

Advertisement

అదేమిటంటే కోలీవుడ్‌ నటుడు సూరి( Kollywood actor Suri ) హీరోగా నటిస్తున్న పలు సినిమాలను లైన్‌ లో పెట్టాడు.ప్రస్తుతం మామన్‌ చిత్రంతో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు మండాడి మూవీలో కూడా నటిస్తున్నాడు.ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎల్‌రెడ్‌ కుమార్‌( Produced by Elred Kumar ) తన ఆర్‌ఎస్‌ ఇన్ఫోటెయిన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ గా వ్యవహరించడం విశేషం.

కాగా ఆయన శిష్యుడు, సెల్షి చిత్రం ఫేమ్‌ మణి మారన్‌ ( Fame Mani Maran )పుగళేంది కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు.నటి మహిమా నంబియార్‌ నాయకిగా నటిస్తోంది.

అదేవిధంగా మండాడి చిత్రం ద్వారా తెలుగు నటుడు సుహాస్‌ ముఖ్య పాత్రతో కోలీవుడ్‌ కు పరిచయం అవుతున్నారట.జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతాన్ని, ఎస్‌ఆర్‌.కదీర్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారట.

కాగా త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.చిత్రం కోసం ప్రత్యేకంగా చిత్రీకరించిన ప్రోమోను కూడా విడుదల చేశారు.

చేతుల‌ను తెల్ల‌గా, మృదువుగా మార్చే వాసెలిన్‌..ఎలాగంటే?

ఈ సందర్భంగా నటుడు సూరి మాట్లాడుతూ.తాను హీరోగా నటిస్తున్న మండాడి చిత్రం ప్రారంభ కార్యక్రమాన్నే ఇంత బ్రహ్మండంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు అన్నారు.

Advertisement

తాను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం దర్శకుడు వెట్రిమారన్‌ నే అని అన్నారు.మరి ఈ సినిమాకు ఏ మేరకు గుర్తింపు తెచ్చి పెడుతుందో చూడాలి మరి.ఈ సినిమా సక్సెస్ అయితే టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా సుహాస్ బిజీ కానున్నాడు.

తాజా వార్తలు