మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు చాలావరకు జాతకం వంటివి నమ్ముతూ ఉంటారు.
అందుకే కొంతమంది నటీనటులు తమ కెరీర్ మీద దెబ్బ పడకుండా ముందుగానే జాతక దోషం కు సంబంధించిన ప్రత్యేక పూజలు చేయించుకుంటూ ఉంటారు.
కానీ కొంతమంది మాత్రం వీటిని అస్సలు పట్టించుకోరు.చాలావరకు తమ టాలెంట్ ను మాత్రమే నమ్ముతూ ఉంటారు.
అయితే అందులో ఒకరు అల్లు అర్జున్( Allu Arjun ) అని చెప్పాలి.టాలెంట్ ని నమ్ముకునే అల్లు అర్జున్ జాతకంలో ఒక దోషం ఉందని తెలియటంతో ఆయన అభిమానులు భయాందోళనకు గురవుతున్నట్టు తెలిసింది.
ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అల్లు అర్జున్ చిన్నవయసులోనే హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఆ తర్వాత స్టైలిష్ స్టార్ గా, ఐకాన్ స్టార్ గా, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు.ఏడాది కిందట విడుదలైన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ బాగా పెరిగిపోయింది.ఏకంగా రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి చేరుకున్నాడు అల్లు అర్జున్.సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల కాగా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మరే సినిమాకు కమిట్మెంట్ తీసుకోక నేరుగా పుష్ప2( Pushpa 2 ) పై దృష్టి పెట్టాడు.ఇక ఈ సినిమాను పుష్ప 1 కంటే ఎక్కువగా అంచనాలు క్రియేట్ చేసేలా చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల కాగా భారీ అంచనాలు పెరిగాయని చెప్పాలి.
ఇక అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఓ రేంజ్ లో ఎదురుచూస్తున్నారు.అయితే ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.అదేంటంటే ఆయన జాతకంలో దోషముందని తెలిసింది.
ఆ దోషం ప్రకారం ఆయన బిగ్గెస్ట్ డిజాస్టర్ ఎదుర్కోవటం ఖాయమని సోషల్ మీడియా( Social Media )లో బాగా వార్తలు వస్తున్నాయి.దీంతో ఆ దోషం కోసం ఆయన ప్రత్యేక పూజలు, హోమాలు చేయించకపోతే భారీ స్థాయిలో నష్టాలు వాటిల్లుతాయని పండితులు చెప్పుకొస్తున్నారు అని తెలుస్తుంది.
అయితే ఈ వస్తున్న వార్తలపై ఆయన అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.నిజంగా ఆయన జాతకంలో దోషం ఉందా లేదా కావాలని క్రియేట్ చేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇక మరి కొంతమంది బన్నీ అటువంటి విషయాలను పట్టించుకోడు.ఆయన టాలెంట్ నే నమ్ముకుంటాడు అని అంటుంటే మరి కొంతమంది నిజంగా జాతకంలో రాసిపెట్టి ఉంటే ఎవరైనా ఏం చేస్తారు కాబట్టి పూజలు చేయించుకోవడమే మంచిది అంటూ సలహాలు ఇస్తున్నారు.అయితే బన్నీ ఫాన్స్ ఇంతలా సలహాలు ఇవ్వటానికి కారణం ఏంటంటే.
ప్రస్తుతం బన్నీ పుష్ప 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఆయన జాతకంలో ఉన్న దోషం ప్రకారం పుష్ప2 భారీ డిజాస్టర్ అవుతుందేమో అని భయపడుతున్నారు.ఆ మధ్యనే బన్నీ కి ఓ సినిమాలో అవకాశం వస్తే ఆ సినిమాను వదులుకున్న సంగతి తెలిసిందే.
దీంతో ఇప్పుడు ఆయన ఖాతాలో పుష్ప 2 ఉండటంతో ఇదే సినిమా డిజాస్టర్ అవుతుందేమో అని అనుమానం పడుతున్నారు.మరి ఆయన జాతకంలో దోషం నిజమో కాదో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల తర్వాతనే తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy