కెరీర్ విషయంలో సక్సెస్ ను సొంతం చేసుకోవాలంటే షార్ట్ కట్స్ ఉండవు అనే సంగతి తెలిసిందే.
ఎంతో కష్టపడితే మాత్రమే సక్సెస్ ను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే తండ్రి మరణించినా ఒక యువకుడు తన కలను నెరవేర్చుకున్నాడు.తల్లి పడుతున్న కష్టాన్ని చూసి తన సక్సెస్ ను అమ్మకు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నాడు.
పట్టుదలతో లక్ష్యాన్ని సాధించిన సురపాటి ప్రశాంత్ కుమార్ ( Surapati Prashant Kumar )ప్రస్తుతం అసిస్టెంట్ కలెక్టర్ గా ఉన్నారు.ట్రైనింగ్ లో భాగంగా ఆత్మకూరుకు వచ్చిన ప్రశాంత్ కుమార్ తన స్వస్థలం పార్వతీపురం అని చెప్పారు.
నాన్న బాబూరావు( Baburao )4 ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారని నేను ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే నాన్న మృతి చెందారని ప్రశాంత్ అన్నారు.అమ్మ ఏ.ఎన్.ఎంగా పని చేస్తున్నారని అన్నయ్య మల్టీ నేషనల్ కంపెనీలో( multinational company ) పని చేస్తున్నారని ప్రశాంత్ పేర్కొన్నారు.నేను ఏడో తరగతి వరకు పార్వతీపురంలో పదో తరగతి వరకు నాసిక్ లో చదివానని ఆయన అన్నారు.
వైజాగ్ లో డిప్లొమా( Diploma in Vizag ) చేసి వాసవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి 2017 సంవత్సరంలో బీటెక్ పూర్తి చేశానని ప్రశాంత్ చెప్పుకొచ్చారు.అమ్మ అన్నయ్యను, నన్ను కష్టపడి చదివించిందని ప్రశాంత్ కామెంట్లు చేశారు.అమ్మ తనకు వచ్చే జీతంతో నాకు ఏ లోటు లేకుండా పెంచిందని ప్రశాంత్ అన్నారు.
అమ్మ కళ్లలో ఆనందం నింపాలనే లక్ష్యంతో చదివానని ప్రశాంత్ కామెంట్లు చేశారు.
నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అనుకున్నది సాధించి కలెక్టర్ గా ఎంపికై అమ్మకు నా సక్సెస్ ను బహుమతిగా ఇచ్చానని ప్రశాంత్ చెప్పుకొచ్చారు.స్పష్టమైన లక్ష్యం ఉంటే సివిల్స్ సాధించడం కష్టం కాదని ఆయన అన్నారు.నెగిటివ్ గా మాట్లాడే వాళ్లకు దూరంగా ఉండాలని ప్రశాంత్ సూచించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy