వైరల్: రోడ్డుపై బైక్‌ స్టంట్స్.. ట్రక్కు ఎదురుగా వచ్చేసరికి?

సోషల్ మీడియా వాడకం అనేది నేడు దారుణంగా పెరిగిపోయింది.స్మార్ట్ ఫోన్స్ ప్రతి ఒక్కరి చేతిలో ఉండడం వలన ఆటోమెటిగ్గానే సోషల్ మీడియా హవా ఎక్కువైపోయింది.

ఈ క్రమంలోనే ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఎలాంటి సంఘటన చోటుచేసుకున్నా క్షణాల్లో వైరల్ అవుతోంది.ఇకపోతే మనలో ఇపుడు కొంతమంది సెలబ్రిటీ హోదా పొందడానికి ఎక్కడబడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు రీల్స్ చేస్తూ, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.దాంతో కోరి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ప్రాణాలు పోతున్న ఘటనలు కూడా మనం అనేకం చూస్తున్నాం.ఇంత జరుగుతున్నా ప్రమాదకరమైన రీతిలో వీడియోలను తీయడం మాత్రం జనాలు ఆపకపోవడం కొసమెరుపు.

ముఖ్యంగా నేటి యూత్ (యువకులు) రీల్స్ కోసం బైక్స్‌తో( Bikes ) రోడ్లపై ఫీట్స్ చేస్తూ, ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటూ ఉంటారు.ప్రమాదం జరిగే విధంగా రాష్ డ్రైవింగ్( Rash Driving ) చేస్తున్న ఘటనలు నేడు దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయి.ఇలాంటి వీడియో ఒకటి వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది.

Advertisement

వీడియోని ఒకసారి గమనిస్తే, ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వచ్చే వాహనాలను పట్టించుకోకుండా బైక్స్‌తో స్టంట్లు( Bike Stunts ) వేయగా ఎదురుగా ట్రక్కును తాకి కింద పడిపోయారు కొందరు యువకులు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో( Viral Video ) లగ్జరీ బైకుపై ఇద్దరు వ్యక్తులు ప్రయాణించడం మనం గమనించవచ్చు.

వారు సాధారణ రీతిలో కాకుండా బైకును రోడ్డుకు అటు ఇటూ వంపులు తిప్పుతూ, రాష్ డ్రైవింగ్ చేయడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది.

ఈ క్రమంలో వారు ఎదురుగా వచ్చే వాహనాలు కూడా పట్టించుకోకపోవడం కొసమెరుపు.బైకు వేగంగా పోనిస్తుండగా దానికి సైడ్ ఇచ్చే తరుణంలో ట్రక్కు ముందు టైర్ భాగానికి తగిలారు.దాంతో బైక్‌ వేగం ఎక్కువ వేగం కావడంతో అది కంట్రోల్ కాలేకపోయింది.

వెనక కూర్చున్న వ్యక్తి అదుపుతప్పి కింద పడిపోయాడు.అదే సమయంలో బైక్ వంపు తిరుగుతుండడంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కూడా కంట్రోల్ చేయలేకపోవడంతో అతను కూడా బైక్‌తో పాటే కింద బక్కబోర్లా పడ్డాడు.

పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌ నుంచి దూకిన ప్రయాణికులు.. వేరే ట్రైన్ కింద నలిగిపోయి.. ఘోర వీడియో!
చెక్‌బౌన్స్‌ కేసులో రామ్ గోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష

ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ రోడ్డుపై వారిద్దరికి గాయాలు అయ్యే అవకాశం ఉందని వీడియోను చూస్తేనే అర్ధం అయిపోతుంది.దీన్ని చూసిన చాలా మంది ఇలా ప్రమాదకరమైన రీతిలో బైక్ స్టంట్లు చేయవద్దని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు