వామ్మో స్టోక్స్ వేసిన బౌన్స‌ర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ జట్టులో నెం.1 ఆల్ రౌండర్.కానీ ప్రస్తుతం మాత్రం బెన్ స్టోక్స్ లక్ మాత్రం అంతలా లేదు.

ఈ మధ్యే జరిగిన యాషెస్ టెస్టులో బెన్ స్టోక్స్ బంతితో పాటు బ్యాటుతోనూ విఫలమయ్యాడు.అందుకోసమే ఆయన రెండో టెస్టు కోసం కఠోర బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

ఈ సందర్బంలో నెట్స్ లో వారు ప్రాక్టీస్ చేస్తుండగా బెన్ స్టోక్స్ విసిరిన బంతి ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ కు వేసిన బౌన్సర్ చాలా షాకింగ్ గా అనిపించింది.డే నైట్ విధానంలో జరిగే రెండో యాషెస్ టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది.

ఆ జట్టు మొదటి యాషెస్ టెస్టులో 9 వికెట్ల తేడాతో ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది.ఇక రెండో టెస్టులో ఎలాగైనా సరే తమ పట్టు చూపెట్టాలని తహతహలాడుతోంది.

Advertisement
Ho My God Stokes Should Be Shocked To See The Bouncer . Ben Stokes, Cricket, Eng

ఇక ఈ టెస్టుకు పింక్ బాల్ వాడనున్నారు.ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా పింక్ బాల్ తోనే ప్రాక్టీస్ చేస్తున్నారు.

Ho My God Stokes Should Be Shocked To See The Bouncer . Ben Stokes, Cricket, Eng

ఇంగ్లండ్ ప్రాక్టీస్ లో ఒక ఘటన చోటు చేసుకుంది.ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ విసిరిన బంతి కాస్త కెప్టెన్ జో రూట్ హెల్మెట్ కు బలంగా తగిలింది.బెన్ స్టోక్స్ మొదటి టెస్టులో అనేక నో బాల్స్ వేశాడు.

దీంతో అతడు బౌలింగ్ వేస్తాడా? లేదా? అని అందరిలో సందేహం నెలకొంది.కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బెన్ స్టోక్స్ మాత్రం నెట్స్ లో రెచ్చిపోతున్నాడు.

ఎలాగైనా సరే తన పదును చూపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు.మరి ఈ డే అండ్ నైట్ టెస్టులోనైనా ఇంగ్లండ్ తన జోరు చూపించి ఆసీస్ కు కళ్లెం వేస్తుందో లేదో వేచి చూడాలి.

స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, టైట్నింగ్ కు ఉపయోగపడే రెమెడీ ఇది.. డోంట్ మిస్!

ఆసీస్ మాత్రం జోరు మీద కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు