ఈ నటీనటుల నిజాయితీ చూస్తే ఆశ్చర్యం వేయకుండా ఉండదు !

సినిమాలో నటించిన నటీనటులు ఎంత నిజాయితీగా ఉంటే అంత ఎక్కువ అభిమానులు వారి సొంతమవుతారు.

కేవలం నటిస్తేనే హీరో అయిపోరు నిజ జీవితంలో కూడా వారు హీరో లాంటి పనులు చేస్తేనే వారికి ఫ్యాన్ బేస్ బాగుంటుంది.

అలాంటి హీరోలను అభిమానించాలి, ఆరాధించాలి.కొంతమంది నటులు రీల్ లైఫ్ లో ఒకలా ఉంటే రియల్ లైఫ్ లో మరోలా ఉంటారు కానీ ఎలాంటి ముసుగు లేకుండా రీల్ మరియు రియల్ లైఫ్ లో హీరోలుగా ప్రవర్తించేవారు కూడా లేకపోలేదు అలా నిజాయితీకి మారుపేరుగా ఉన్న కొంతమంది విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బ్రహ్మాస్త్ర ( Brahmastra ) సినిమాలో ఆలియా భట్ తో కలిసి రణబీర్ కపూర్( Ranbir Kapoor ) హీరోగా నటించగా, ఈ సినిమాలో నటించినందుకు గాను ఆయనకు నేషనల్ అవార్డు కూడా దక్కింది.అయితే ఈ అవార్డు దక్కగానే రణబీర్ కపూర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.నాకన్నా కూడా ఈ సినిమాలో చాలామంది అద్భుతంగా నటించారు ఈ నేషనల్ అవార్డుకు నేను అర్హుడు నీ కాను అని ఆయన చెప్పారు.

అలా చెప్పడంతో చాలామంది రణబీర్ కపూర్ నిజాయితీని మెచ్చుకున్నారు.ఇక సాయి పల్లవి( Sai Pallavi ) ఇలాంటి హీరోయిన్ కూడా ఏ మాత్రం తక్కువ తినలేదు ఒక పేరు ఫెయిర్ నెస్ క్రీమ్ సంబంధించిన కంపెనీ యాడ్ చేస్తే రెండు కోట్లు ఇస్తానన్నా కూడా నేను మొహానికి పూసుకొని యాడ్ ఎప్పటికీ నటించను అంటూ మొహం మీదే తిప్పి కొట్టింది.

Advertisement

అల్లూరి సీతారామరాజు సినిమా( Alluri Sitaramaraju Movie ) తీస్తున్న క్రమంలో ఆ సినిమా డైరెక్టర్ హఠాత్తుగా చనిపోయారు.మిగతా భాగాన్ని కృష్ణ ( Krishna )దర్శకత్వం చేసి విడుదల చేయగా మంచి విజయం సాధించింది.అయితే పేరు కోసం పరితపించకుండా కృష్ణ తాను చేసిన పోర్షన్ పాటు మొత్తానికి చనిపోయిన దర్శకుడు పేరు వేసి ఆయన నిజాయితీ ఏంటో అందరికీ తెలియజేశారు.

ఇక దంగల్ సినిమా( Dangal Movie ) టైంలో ఈ సినిమాని చాలా దేశాలలో విడుదల చేశారు.పాకిస్తాన్ లో కూడా విడుదల చేయాలని అమీర్ ఖాన్( Aamir Khan ) ప్రయత్నించారు.

అయితే అక్కడ జాతీయ జెండాను తీసేసి విడుదల చేయాలని ఈ సదరు పరిశ్రమ కోరగా ఎన్ని కోట్లు పోయిన పర్వాలేదు.సినిమాలో జెండా తీసే ప్రసక్తే లేదు అంటూ అమీర్ ఖాన్ పాకిస్తాన్ లో సినిమాని విడుదల చేయలేదు.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు