ఏ రంగం మూతపడినా సినిమా ఇండస్ట్రీ అనేది అసలు క్లోజ్ అవ్వదు.మూవీ ఇండస్ట్రీని దర్శకులు, కథా రచయితలు ముందుకు తీసుకెళ్తుంటారు.
వారు మాత్రమే కాదు నిర్మాతలు, నిర్మాణ సంస్థలు కూడా మూవీ ఇండస్ట్రీలో కీలకమైన పాత్రలు పోషిస్తారు.దర్శకులు ఫలానా హీరో హీరోయిన్ లాంచ్ చేశారని చెబుతుంటారు కానీ నిజానికి ప్రొడక్షన్ హౌస్ లే కొత్త వారిపై నమ్మకం ఉంచి వారిని చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తుంటాయి.
అలా చాలామందిని పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌస్ లో ఎన్నో ఉన్నాయి వాటిలో వైజయంతి మూవీస్( Vyjayanthi Movies ) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.చలసాని అశ్విని దత్ 1972లో ఈ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించారు.
ఈ నిర్మాణ సంస్థ తెలుగు సిల్వర్ స్క్రీన్‌కు చాలా ప్రముఖ నటీనటులను పరిచయం చేసింది.వారిలో టాప్ హీరో హీరోయిన్ల గురించి తెలుసుకుంది.
సూపర్ స్టార్ కృష్ణ ముద్దుల కుమారుడు మహేష్ బాబును( Mahesh Babu ) రాజకుమారుడు (1999) సినిమా ద్వారా పరిచయం చేసింది వైజయంతి మూవీస్.ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ కింద సి.అశ్వని దత్ నిర్మించారు.
అల్లు అరవింద్ కుమారుడు, మెగాస్టార్ అల్లుడు అల్లు అర్జున్( Allu Arjun ) గంగోత్రి (2003) సినిమాతో వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే.ఈ సినిమాని అల్లు అరవింద్, సి.అశ్విని దత్ నిర్మించారు.వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ దీనిని కూడా నిర్మించింది.దీని ద్వారా బన్నీతో పాటు అదితి అగర్వాల్‌ను( Aditi Agarwal ) తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేసింది
నందమూరి హీరో తారకరత్న( Tarakaratna ) మొదటి మూవీ "ఒకటో నెంబర్ కుర్రాడు".ఈ సినిమాతో అతడిని హీరోగా పరిచయం చేసిన ఘనత వైజయంతి మూవీకే దక్కుతుంది.
వైజయంతి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కిన "బాణం" మూవీ ద్వారా నారా రోహిత్( Nara Rohith ) కథానాయకుడిగా మూవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
కమింగ్ ఆఫ్ ఏజ్, అడ్వెంచర్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.నాని, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.ప్రియాంక దత్, స్వప్నా దత్ నిర్మించారు.
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ద్వారా విజయ్( Vijay Devarakonda ) మాళవికలను వైజయంతి సంస్థ లాంచ్ చేసింది.
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) మహానటి సినిమా ద్వారా తెలుగు పరీక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే.ఈ మూవీని కూడా వైజయంతి సంస్థ ప్రొడ్యూస్ చేసింది.
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) "సీతారామం" సినిమాతో తెలుగువారికి ఎంతో దగ్గరయ్యింది.ఆమెను లంచ్ చేసిన ఘనత కూడా వైజయంతి మూవీస్ కే దక్కుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy