స్టార్ హీరోయిన్ కృతిశెట్టి తొలి రెమ్యునరేషన్ అంత తక్కువా.. అలాంటి అబ్బాయిలంటే ఇష్టమా?

స్టార్ హీరోయిన్ కృతిశెట్టి( Krithi Shetty ) మనమే సినిమాతో( Manamey Movie ) కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారని అభిమానులు ఫీలవుతున్నారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మరో రెండు రోజుల్లో జరగనుండగా పిఠాపురంలో ఈ ఈవెంట్ జరగనుండటం పవన్ ఫ్యాన్స్ తో పాటు మెగా అభిమానులకు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

అయితే కృతిశెట్టి తాజాగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తన తొలి సంపాదన 100 రూపాయలు అని చెప్పి ఈ బ్యూటీ నెటిజన్లను ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు.

తాను చాలా బాగా పాటలు పాడతానని అయితే ప్రస్తుతం తన సింగింగ్ టాలెంట్ బాత్ రూంకే పరిమితమైందని ఆమె తెలిపారు.నేను పాట పాడితే ఇంట్లో అమ్మానాన్నలకు నచ్చదని కృతిశెట్టి పేర్కొన్నారు.

కేరీర్ పరంగా డాన్స్ బేస్డ్ మూవీ ఒకటి, యాక్షన్ బేస్డ్ మూవీ ఒకటి చేయాలని ఉందని ఆమె చెప్పుకొచ్చారు.

Advertisement

స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) అంటే చాలా ఇష్టమని నటిగా మారాలని భావించిన తర్వాత రంగస్థలం( Rangasthalam ) చూశానని కృతిశెట్టి కామెంట్లు చేశారు.తాను రామ్ చరణ్ కు ఫ్యాన్ అయిపోయానని ఆమె చెప్పుకొచ్చారు.నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టమని కృతిశెట్టి పేర్కొన్నారు.

వెజ్ నూడిల్స్ అయినా నాన్ వెజ్ నూడిల్స్ అయినా ఇష్టంగా తింటానని ఆమె చెప్పుకొచ్చారు.

తాను టాటూ కల్చర్ ను ఫాలో అవ్వడం లేదని తన శరీరంపై ఎలాంటి టాటూలు లేవని ఆమె చెప్పుకొచ్చారు.నాకు నిజాయితీగా ఉండే అబ్బాయిలంటే చాలా ఇష్టమని కృతిశెట్టి పేర్కొన్నారు.తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పొడవుగా చూడటానికి బాగుండాలని ఆమె చెప్పుకొచ్చారు.

హీరోయిన్ కృతిశెట్టి చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?
Advertisement

తాజా వార్తలు