Sana fatima bollywood : స్టార్ హీరోయిన్ కు మూర్ఛ వ్యాధి.. షాక్ లో అభిమానులు!

సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి లైఫ్ బాగుంటుంది అనుకోవటం పొరపాటు.వారికి ఎటువంటి కష్టాలు ఉండవని ఎప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారని అనుకుంటూ ఉంటాం.

వారి జీవితంలో కూడా చాలా కష్టాలు ఉంటాయి.వాళ్ళు ఎప్పుడైతే తెర ముందు కనిపిస్తారో అంతవరకు మాత్రమే సంతోషంగా కనిపిస్తారు.

ఆ తర్వాత వాళ్ళ సమస్యలతో బాధపడుతూ ఉంటారు.చాలావరకు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

ఈ విషయాన్ని సందర్భం బట్టి చెబుతూ ఉంటారు.ఇప్పటికే చాలామంది నటీనటులు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు.

Advertisement
Star-heroine Has Epilepsy Fans In Shock Star Heroine , Epilepsy ,sana Fatima ,bo

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.ఇటీవలే ఈ విషయాన్ని చెప్పి తన ఫ్యాన్స్ ని బాధ పెట్టింది.

అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత ప్రస్తుతం చికిత్స చేయించుకుంటుంది.అయితే తాజాగా మరో స్టార్ హీరోయిన్ కు కూడా మూర్చ వ్యాధి ఉన్నట్లు తెలిసింది.

ఈ వ్యాధి ఉందని తెలియడంతో తన అభిమానులు చాలా బాధపడుతున్నారు.ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్.దంగల్ సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.ఇండస్ట్రీకి బాలనటిగా అడుగుపెట్టి చాలా సినిమాలలో పాలనట్టుగా నటించింది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

ఇక దంగల్ సినిమాతో తొలిసారిగా హీరోయిన్గా అడుగు పెట్టింది.నువ్వు నేను ఒకఒక్కటావుదాం అనే తెలుగు సినిమాలో కూడా నటించింది.

Advertisement

కానీ బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Star-heroine Has Epilepsy Fans In Shock Star Heroine , Epilepsy ,sana Fatima ,bo

కేవలం సినిమాలలోనే కాకుండా సీరియల్స్ లో కూడా నటించింది.అంతేకాకుండా మ్యూజిక్ వీడియోలో కూడా చేసింది.ఇక ఈమె తన నటనకు పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది.తనకు సంబంధించిన విషయాలను, ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు మూర్చ వ్యాధి ఉందని తెలిసింది.ఇక ఆ విషయాన్ని తానే స్వయంగా తెలిపింది.తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా తనకు మూర్ఛ వ్యాధి ఉందని తెలిపింది.

తన కుటుంబం, తన స్నేహితుల నుంచి మంచి మద్దతు రావటం వల్ల బలంగా ఉంటున్నాను అని తెలిపింది.ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారగా.

తన ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు.గతంలో ఈ బ్యూటీ వ్యక్తిగత విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

తనతో తో కలిసి దంగల్ సినిమాలో నటించిన అమీర్ ఖాన్ తో ప్రేమలో ఉందని వార్తలు వినిపించాయి.అమీర్ ఖాన్ కూడా ఈమెను పెళ్లి చేసుకోవడం కోసమే తన భార్యకు విడాకులు ఇచ్చాడని తెలిసింది.

కానీ ఇందులో ఎంత నిజముందో ఇప్పటికీ తెలియలేదు.దంగల్ సినిమా కోసం శిక్షణ పొందుతున్న సమయంలోనే తనకు ఈ వ్యాధి నిర్ధారణ అయ్యిందని తెలిపింది.

తాజా వార్తలు