Boyapati Srinu : యంగ్ హీరోలకు హ్యాండ్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్లు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు స్టార్ హీరోలందరికీ సక్సెస్ లని ఇస్తున్నారు.కానీ యంగ్ హీరోల విషయానికి వచ్చేసరికి మాత్రం తడబడుతున్నారు.

అలాంటి వారిలో బోయపాటి శ్రీను ఒకరు.ఈయన సీనియర్ స్టార్ హీరోలకి భారీ సక్సెస్ లను అందించాడు.

కానీ యంగ్ హీరోలు అయిన రామ్, రామ్ చరణ్ లాంటి హీరోలకు మాత్రం భారీ డిజాస్టర్ లను ఇచ్చాడు.బోయపాటి శ్రీనుతో యంగ్ హీరోలు సినిమాలు చేయడానికి భయపడుతున్నారు.

ఇక రీసెంట్ గా ఆయన రామ్ తో చేసిన స్కంద సినిమా( Skanda ) ఫ్లాప్ అవడంతో ఆయనని నమ్మి సినిమా ఇచ్చే యంగ్ హీరో ఎవరు లేకపోవడంతో మళ్లీ బాలయ్య బాబు తోనే బోయపాటి సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో బోయపాటి మరోసారి తన స్టామినా ఏంటో ప్రేక్షకులకు చూపించాలని చూస్తున్నాడు.

Advertisement

వి వి వినాయక్ కూడా ఇదే కొవ కు చెందుతాడు.ఎందుకంటే ఆయన కూడా స్టార్ హీరోలు అందరికీ సక్సెస్ లను అందించాడు.కానీ యంగ్ హీరోలు అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్, సాయిధరమ్ తేజ్ లాంటి హీరోలకు మాత్రం సక్సెస్ లను ఇవ్వలేకపోయాడు.

దాంతో ఇప్పుడు ఆయనని నమ్మి సినిమా ఇచ్చే హీరోలు అయితే లేరనే చెప్పాలి.ఇక మళ్ళీ ఆయన సినిమా చేయాల్సి వస్తే సీనియర్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ కొట్టాల్సిందే తప్ప, యంగ్ హీరోలు మాత్రమే ఆయనకి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే లేదు.ఎందుకంటే ఆయన ఇప్పటికే వరుసగా యంగ్ హీరోలందరికి అల్ట్రా డిజాస్టర్ లను ఇచ్చారు.

చూడాలి మరి వినాయక్ మళ్ళీ సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తాడా, లేదంటే యంగ్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ కొడతాడా అనేది.

White Hair : తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయిందా.. వర్రీ వద్దు ఈ ఆయిల్ ను వాడితే మీ కురులు మళ్లీ నల్లగా మారడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు