పది రూపాయిలకే చీర అంటే ఎవరికైన ఆశ వుంటుంది.
వ్యాపార సంస్థలు తమ వ్యాపారభివృద్ధి కోసం వస్త్ర దుకాణాల యజమానులు ఇలాంటి ఆఫర్స్ ని పెడుతూ వుంటారు.
అలాంటి ఆఫర్స్ ప్రకటిస్తే సామాన్య, మధ్యతరగతి మహిళలు భారీ సంఖ్యలో ఎగబడతారు.ఇప్పుడు అలాంటి పరిస్థితి సిద్ధిపేటలో జరిగింది.
సిద్ధిపేటలో సిఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం పది రూపాయిలకే చీర అని ప్రకటించడంతో గత రెండు రోజులుగా ఆ చుట్టు పక్కల మహిళలు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు.అయితే చీరల కోసం వచ్చే మహిళల కోసం షాపింగ్ మాల్ యాజమాన్యం ఎలాంటి రక్షణ చెర్యలు తీసుకోలేదు.
దానికి తోడు కేవలం గంట మాత్రమె ఆఫర్ ఉంటుందని ప్రకటిందింది.ఈ నేపధ్యంలో ఈ రోజు ఉదయం సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర భారీ సంఖ్యలో మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
అదే సమయంలో షాపింగ్ సిబ్బంది ఒక్కసారిగా తలుపులు తెరవడంతో మహిళలు షాపింగ్ మాల్ లోకి ఒక్కసారిగా దూసుకొచ్చారు.దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.
దాంతో పాటు జేబుదొంగలు వారి చెతికి పని చెప్పి, మహిళల మేడలో ఆభరణాలు తష్కరించారు.ఈ తొక్కిసలాటలో పలువురు మహిళలకి గాయాలు కావడం జరిగింది.
దాంతో కొంత మంది మహిళల మేడలో ఆభరణాలు దొంగలు దోచేయడంతో వారు రోడ్డు మీదక్కొచ్చి లబోదిబో అంటూ ఏడవడం మొదలుపెట్టారు.ఈ ఘటనతో గాయాలు తగిలిన వారిని హాస్పిటల్ కి తరలించగా.
ఆభరణాలు పోగొట్టుకున్నవారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy