టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
జక్కన్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
డైరెక్టర్గా కెరియర్ ను మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ ని కూడా చూడలేదు అంటే ఆశ్చర్యం వేయక మానదు.కాగా ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.
అంతేకాకుండా రికార్డుల మోతలు మోగించాయి.ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండును కూడా సృష్టించాయి.
ఇకపోతే జక్కన్న చివరగా ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యి సరికొత్త రికార్డులు సృష్టించింది.ఇకపోతే జక్కన్న తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో( Mahesh Babu ) చేయబోతున్న విషయం తెలిసిందే.
త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.కాగా మాములుగా దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా కోసం హీరోలు హీరోయిన్లు ఎదరుచూస్తు ఉంటారు.
ఆయన కన్ను తమ మీద పడకుండా ఉంటుందా అని ఆలోచించేవారు కూడా లేకపోలేదు.స్టార్లు కూడా ఆయన పిలుపుకోసం వెయిట్ చేయాల్సిందే.
ఇక చిన్న తారలు అయితే జక్కన్న సినిమాలో ఒక్క పాత్ర వచ్చినా చాలు అనుకుంటారు.
మరి అందరు అంత గొప్పగా చూసే రాజమౌళికి ఒక యంగ్ హీరోయిన్ నటన అంటే చాలా ఇష్టమట.ఇంతకీ ఎవరా లక్కీ గర్ల్ అని అనుకుంటున్నారా, రాజమౌళి ఎంత మందితో పనిచేసినా.ఆయన మెచ్చిన లేడీ స్టార్స్ మాత్రం సావిత్రి, సూర్యకాంతం మాత్రమేనట.
అయితే ఈ జనరేషన్ లోని యంగ్ స్టార్స్ లో మాత్రం జక్కన్న ఒక హీరోయిన్ నటన అంటే అభిమానిస్తాడట.ఆమె మరెవరో కాదు అనీ.నాగార్జున హీరోగా నటించిన రాజన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అనీ.( Annie ) ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించగా సినిమాలో యాక్షన్ సీన్స్ ను రాజమౌళి డైరెక్ట్ చేశారట.కీరవాణి సంగీతం అందించారట.
చైల్డ్ ఆర్టిస్ట్ చిన్నారి అనీ నటనకి తాను ఫిదా అయినట్లు తెలిపారు.అలాగే సినిమాలోని ఒక పెద్ద సీన్ ఉంది.
అందులో నటించడం పెద్దవాళ్లకు కూడా కష్టం.కాని ఆ సీన్ ను ఎంతో ఈజీగా అనీ చేసేసింది.
కళ్ళు తిప్పుకోకుండా నటించడం ఎవరివల్లా కాదు.కానీ అమ్మాయి కళ్ళతోనే ఎమోషనల్స్ పలికించింది అని రాజమౌళి అన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy