నాకు ఒక్క ఆఫర్‌ రాకుండా చేశాడు... నా కెరీర్‌ నాశనం, చావేగతి

కన్నడంలోనే కాకుండా సౌత్‌ ఇండియా మొత్తంలో కూడా అర్జున్‌కు మంచి పేరు ఉంది.

ఈయన తెలుగు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించి హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.

సౌత్‌ స్టార్‌ హీరోగా పేరున్న అర్జున్‌పై కొన్ని రోజుల క్రితం హీరోయిన్‌ శృతి హరిహరన్‌ తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.తనను లైంగికంగా వేదించాడని, తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ అర్జున్‌ పై శృతి హరిహరన్‌ ఆరోపణలు చేసింది.

ఆ ఆరోపణలు సౌత్‌ ఇండియా మొత్తం సంచలనం అయ్యాయి.

శృతి హరిహరన్‌ చేసిన ఆరోపణలను ఎంతో మంది తప్పుబట్టారు.అర్జున్‌ అటువంటి వ్యక్తి కాదని ఎంతో మంది ఆయనకు మద్దతుగా నిలిచారు.అదే సమయంలో అర్జున్‌ కూడా ఆమెపై పరువు నష్టం దావా వేశాడు.

Advertisement

తీవ్ర వివాదానికి తెర లేపిన శృతి హరిహరన్‌ కన్నడ సినీ పెద్దలు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించగా అందుకు నో చెప్పింది.ఇంతలా రెచ్చి పోయిన శృతి హరిహరన్‌ను పూర్తిగా తొక్కేశారు.

ఆమెతో ఏ ఒక్కరు కూడా సినిమాలు చేసేందుకు ముందుకు రావడం లేదు.

అర్జున్‌పై అభిమానంతో కొందరు ఆమెను కాదంటుంటే, మరికొందరు మాత్రం ఆమెతో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నా, ఆమెతో వర్క్‌ చేసేందుకు ఇతర హీరోలు, హీరోయిన్స్‌ ఒప్పుకోవడం లేదు.దాంతో శృతిహరిహరన్‌కు ఈ రెండు నెలలుగా ఒక్క ఆఫర్‌ అంటే ఒక్కటి కూడా రాలేదు.దాంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరోసారి అర్జున్‌పై ఆరోపణలు చేసింది.

నా కెరీర్‌ను నాశనం చేసేందుకు అర్జున్‌ ప్లాన్‌ చేశాడు.నాకు ఒక్క ఆఫర్‌ రాకుండా చేశాడు.

కరోనా వల్ల 'డేంజర్'లో యువత..?

ఆయన వద్దని చెప్పడం వల్లే నాకు ఏ ఒక్కరు ఆఫర్‌ ఇవ్వడం లేదని ఆమె ఆరోపించింది.గతంలో ఎప్పుడు ముగ్గురు నలుగురు నిర్మాతలు నాతో టచ్‌లో ఉండేవారు.

Advertisement

కాని ఇప్పుడు ఒక్కరు కూడా నన్ను సంప్రదించేందుకు రావడం లేదని చెప్పుకొచ్చింది.అయితే అర్జున్‌ మాత్రం ఆమె గురించి స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు.

తాజా వార్తలు