నిండుకుండలా శ్రీశైలం జ‌లాశ‌యం

శ్రీశైలం జ‌లాశయానికి భారీగా వ‌ర‌ద నీరు పోటెత్త‌డంతో నిండుకుండ‌లా ద‌ర్శ‌నమిస్తోంది.జూరాల ప్రాజెక్టు నుండి భారీగా వ‌ర‌ద ప్ర‌వాహం పెర‌గ‌డంతో కృష్ణ‌మ్మ ఉర‌క‌లేస్తుంది.

దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేశారు అధికారులు.శ్రీశైలంలో గేట్లు ఎత్తి వేయ‌డంతో ప్రాజెక్టు అందాల‌ను వీక్షించేందుకు ప‌ర్యాట‌కులు త‌ర‌లివ‌స్తున్నారు.ప్ర‌స్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 885 అడుగులు కాగా, ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 884.20 అడుగులుగా ఉంది.జ‌లాశ‌యం పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటిమ‌ట్టం 210 టీఎంసీలుగా ఉంది.

ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,02,932 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,77,080 క్యూసెక్కులుగా ఉంద‌ని అధికారులు వెల్ల‌డించారు.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement