హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

శ్రీరామనవమి పర్వదినం( Sri Ramanavami festival ) సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లో శోభాయాత్ర జరగనుంది.ఈ మేరకు జంట నగరాల్లో ఈ యాత్ర కొనసాగనుండగా.

పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.ధూల్ పేట సీతారాంబాగ్ ( Dhul Peta Sitarambagh )నుంచి కోఠి హనుమాన్ వ్యాయామశాల( Kothi Hanuman Gymnasium ) వరకు రాముని శోభాయాత్రను నిర్వహించనున్నారు.

భాగ్యనగర్ శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర జరగనుంది.ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

కాగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు సూచించిన మార్గంలోనే శోభాయాత్రను నిర్వహించుకోవాలని ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ యాత్ర సందర్భంగా గోషామహల్, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో ట్రాఫిక్ ను పోలీసులు మళ్లించనున్నారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు