శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు

మద్యపాన నిషేదం ఓబూటకం - ఓట్ల కోసమే నాడు జగన్నాటకం నాసిరకం మద్యంను వెంటనే నిలిపి వేయాలి-ప్రజల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది - అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారు.

బాపట్ల జిల్లా,రేపల్లె నియోజకవర్గం, పోటుమెరకగ్రామంలో కల్తీ మద్యం తాగి గరికపాటి నాంచారయ్య, రేపల్లె రత్తయ్య మృతి చెందిన ఘటనపై రేపల్లె మండలంలోని మోటుమెరకు గ్రామంలో బాధిత కుటుంబాలను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించటానికి చిలకలూరిపేటలోని ఎమ్మెల్యే నివాసంనుండి బయలుదేరిన అద్దంకి శాసనసభ్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.

పోలీసుల తీరును తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే గొట్టిపాటి.అనంతరం మీడియాతో మాట్లాడుతూ.

బాధిత కుటుంబాల పరామర్శలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ,వైకాపా ప్రభుత్వం మా ప్రాధమిక హక్కులను హరించడమేవైకాపాలనలో ఆంధ్రప్రదేశ్ ను మధ్యాంధ్రప్రధేశ్ గా మార్చారు ఏపిలో మద్యం మరణాలు సర్వ సాధారణం అయ్యాయి.ప్రతి మహిళా కంట నీరు పెట్టకుండ చూస్తానని మాయమాటలు చెప్పి మహిళా ఓట్లతో గద్దెనెక్కిన జగన్ రెడ్డి నేడు వారి పుస్తెలను తెంపుతున్నారు.ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యపాన నిషేదిస్తానని చెప్పి నాటుసారాని రూపుమాపుతానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక జే బ్రాండ్ నాసిరకం మద్యం అమ్మడమే కాక, మరో వైపు నాటుసారా మాఫియాని పెంచి పోషిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారుమద్యపాన నిషేదం ఓ బూటకం - ఓట్ల కోసమే నాడు జగన్నాటకం సంపద సృష్టించటం జగన్ కు చేతకాదు కాబట్టే ప్రజల రక్తం పీల్చి మద్యంపై ఆదాయం పెంచుకుంటున్నారుఅమ్మఒడికి రూ.14 వేలిచ్చి నాన్న బుడ్డితో రూ.40 వేలు లాక్కుంటున్నారు,మహిళ ఓట్ల తో గెలిచి నేడు మహిళలను తీవ్రం గా ఇబ్బంది పెడుతున్నారు జగన్ రెడ్డి స్వంత బ్రాండ్ లతో ప్రజలు ప్రాణాలు తీస్తున్నారుమొన్న జంగారెడ్డిగూడెం,నిన్న చిలకలూరిపేట ,నేడు రేపల్లె లలో మద్యం తాగి మరణించారుప్రభుత్వ వైన్ షాపు లలో కొనుగోలు చేసిన మద్యం తాగి బాధితులు మరణిస్తున్నారుల్యాబ్ రిపోర్ట్ లు రాకుండానే మద్యం మరణాలు కాదని ఎలా చెబుతారు.జగన్ రెడ్డి ప్రభుత్వం అమ్ముతున్న బ్రాండ్లలో ప్రాణాలు తీసే విషపదార్థాలు,అక్రమ ఆదాయం కోసం నాసికరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తూ బుకాయిస్తారా? రాష్ట్రంలోని మద్యం డిస్టలరీలన్నీ వైసిపి నేతలు తమ గుప్పిట్లో పెట్టుకుని అక్రమ సంపాదన కోసం నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారువైసిపీ ప్రభుత్వం అమ్ముతున్న మద్యంలో ప్రాణాలు తీసే విషపదార్థాలున్నాయని ల్యాబ్ నివేదికల్లో వైల్లడైన విషయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రజలకు చెప్పాంకానీ మద్యంలో జగన్ రెడ్డి సాగిస్తున్న దందా బయటపడిందన్న అక్కసుతో వైసీపీ నేతలు టీడీపీపై ఎదురు దాడి చేయటం సిగ్గుమాలిన చర్య.మద్యాన్ని పరీక్షించకుండానే అందులో విష పదార్థాలు లేవని వైసిపి నేతలు ఎలా చెబుతారు? వాళ్లేమైనా సైంటిస్టులా ?ఏపిలో అమ్ముతున్న మద్యం నమూనాలు సేకరించి నిష్పక్షపాతంగా నిబంధనల ప్రకారం చెన్నై ఎస్.జి.ఎస్ ల్యాబ్ లో టెస్ట్ చేయించి వాటిలో ప్రమాదకరమైన రసాయనాలున్నాయని తెదేపా నిజనిర్ధారణ కమిటీ గుర్తించిందని.ఆంధ్రా గోల్డ్ విష్కీ, 9 సీ హార్స్ విష్కీ, సిల్వర్ స్ట్రాప్ బ్రాండ్లలలో ఫైరోగెలాల్, ఐసోఫ్లూరిక్ యాసిడ్, డైతలి పాతలేట్ అనే విషరసాయనాలున్న మాట వాస్తవం కాదా?ఈ బ్రాండ్లకు అనుమతిచ్చిందెవరు?జగన్ రెడ్డి కాదా? 2019-20 నూతన మద్యం పాలసీలో కమీషన్లు తీసుకుని ఈ నాసికరం బ్రాండ్లకు అనుమతివ్వటం వాస్తవం కాదా?జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మొత్తం 106 కొత్త బ్రాండ్లకు అనుమతిలిచ్చినట్టు ,ప్రభుత్వమే అధికారంగా స.హ.చ ద్వారా సమాచారం ఇచ్చింది.కమీషన్ల కోసం దేశంలో ఎక్కడా దొరకని నాసిరకం జేబ్రాండ్ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తూ సిగ్గులేకుండా బుకాయిస్తారా ?ప.గో జిల్లా జంగారెడ్డి గూడెం నాటుసారా మృతులకు సంబంధించి వారు అల్కాహాల్ బేస్ డ్ లిక్కర్ త్రాగడం వల్లే చనిపోయారని డాక్టర్లు రిపోర్టులు ఇచ్చింది వాస్తవం కాదా అన్నారు?చంద్రబాబు నాయుడు డిస్టరీలకు పర్మిషన్ ఇచ్చారంటున్నారు,కానీ ఇప్పుడు ఆడిస్టలరీలు సరఫరా చేస్తున్న నాసిరకం బ్రాండ్లకు అనుమతిచ్చిందెవరుమద్యంలో విషపదార్ధాలు లేవంటున్న వైసిపీ నేతలు ఆ విషయాన్ని మేం చెప్పిన మూడు బ్రాండ్లు ఆంధ్రా గోల్డ్, నైన్ సీ హార్స్, సిల్వర్ స్ట్రాప్ బ్రాండ్ల శాంపిల్స్ టెస్ట్ చేసి వాటిలో విషరసాయనాలు లేవు అని నిరూపించగలరా ?డిస్టలరీల దగ్గర వేల కోట్లు కమీషన్లు తీసుకుని నాసిరకం మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.మళ్లీ మళ్లీ చెబుతున్నాం.

జగన్ రెడ్డి ప్రభుత్వం అమ్ముతున్న మద్యం బ్రాండ్లలో ప్రజల ప్రాణాలుతీసే విషపదార్ధాలున్నాయి ,ఆ మద్యం ప్రజలు తాగొద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.బాధితులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశంపార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ అండగా నిలుస్తుందన్నారు.

Advertisement
ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 

తాజా వార్తలు