అట్లుంటది ఎస్ఆర్ఎచ్ తో.. దెబ్బకి రికార్డులు బద్దలు..

సన్ రైజర్స్ హైదరాబాద్( Sunrisers Hyderabad ) జట్టు మరోసారి భారీ స్కోర్ ను సాధించింది.

నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేయగలిగింది.

ఇక భారీ లక్ష ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 199 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయ్యింది.దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 67 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.

ఇకపోతే మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అనేక రికార్డులను కొల్లగొట్టింది.ఇక వాటి వివరాలు ఒకసారి చూస్తే.

Srh New Record Highest In T20 History Details, Srh, Batting, Sports Updates, S

పవర్ ప్లే, తొలి 10 ఓవర్లలో భారీ స్కోర్ చేసిన జట్టుగా t20 ఫార్మేట్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డును క్రియేట్ చేసింది.ముఖ్యంగా పవర్ ప్లే స్కోర్ టి 20 హిస్టరీలోనే అత్యధిక స్కోర్ ను నమోదు చేశారు.ట్రావిస్ హెడ్( Travis Head ) 32 బంతుల్లో 83 పరుగులను చేయగా, అభిషేక్ శర్మ( Abhishek Sharma ) కేవలం 12 బాల్స్ లో 46 పరుగులు చేయడంతో సరికొత్త రికార్డులను సృష్టించారు.

Advertisement
Srh New Record Highest In T20 History Details, Srh, Batting, Sports Updates, S

ఢిల్లీ క్యాపిటల్స్ సొంత స్టేడియంలో వారి బౌలర్లను ఊచకోత కోశారు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్.కేవలం పవర్ ప్లే లో ఏకంగా ఒక్క వికెట్ నష్టపోకుండా 125 పరుగులు చేసి రికార్డులను సృష్టించింది.

ఏ టి20 క్రికెట్ చరిత్రలో చూసిన ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోర్.ఇక అలాగే తొలి 10 ఓవర్ల తర్వాత కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రికార్డును సృష్టించింది.10 ఓవర్లు ముగిసే సమయానికి 158 పరుగులను ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు సాధించారు.ఇదే క్రమంలోనే ఎస్ఆర్హెచ్ గత మ్యాచ్ లో క్రియేట్ చేసిన ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సులు 22 ను మరోసారి సమం చేసింది.

Srh New Record Highest In T20 History Details, Srh, Batting, Sports Updates, S

శనివారం నాడు జరిగిన ఢిల్లీ నగరంలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోగా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ ఆకాశమే హద్దుగా చెలరేగారు.ఇక లక్ష్య ఛేదనలో కూడా మొదటగా ఢిల్లీ క్యాపిటల్స్ బాగానే ఆడిన తర్వాత వరుస వికెట్స్ పడిపోవడంతో స్కోరు మందగించింది.దీంతో చేయాల్సిన పరుగుల రన్ రేట్ పెరుగుతూ వెళ్ళింది.

చివరికి 199 పరుగులకు ఆల్ అవుట్ కాగా ఎస్ఆర్హెచ్ బౌలర్ నటరాజన్ తన టి20 క్రికెట్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ను సొంతం చేసుకున్నాడు.తన నిర్ణీత నాలుగు ఓవర్లు వేసిన నటరాజన్ కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లను పడగొట్టాడు.

విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
బీఎల్ఏ దాడి.. 'జాఫర్ ఎక్స్‌ప్రెస్' రైలు హైజాక్

ఇందులో ఓ మేడిన్ ఓవర్ కూడా ఉండడం విశేషం.

Advertisement

తాజా వార్తలు