టాలీవుడ్ లో వరుస హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తున్న యంగ్ బ్యూటీ శ్రీలీల ( Sreeleela ) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
ఈమె ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం అయ్యింది.
ఈమె పెళ్లి సందడి ( Pelli SandaD ) సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన పెళ్లి సందడి మూవీ ద్వారా టాలీవుడ్ ( Tollywood ) లోకి రాఘవేంద్రరావు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఇక మొదటి సినిమా తోనే ఈమె నటన, అందం, డ్యాన్స్, హావభావాలతో అలరించి తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది.దీంతో ఈమెకు వరుస ఆఫర్స్ రావడం మొదలయ్యాయి.ఇక ఈ మధ్యనే వచ్చిన ధమాకా సినిమాతో అయితే ఈ అమ్మడు ఏకంగా స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరిపోయింది అనే చెప్పాలి.
ఈ సినిమాలో మాస్ రాజా రవితేజను మించిన ఎనర్జీతో ఈ అమ్మడు ఆకట్టుకుంది.
దీంతో ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి మరిన్ని ఆఫర్స్ వరిస్తున్నాయి.ఇంతకు ముందు కుర్ర హీరోల సరసన అవకాశాలు అందుకున్న ఈమె ధమాకా తర్వాత మాత్రం స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటుంది.ప్రస్తుతం శ్రీలీల చేతిలో మొత్తం 9 సినిమాలు ఉన్నాయని టాక్.
ఒకేసారి ఇన్ని అవకాశాలు అంటే అందరు షాక్ అవుతున్నారు.
వీటిల్లో మహేష్ బాబు (Mahesh Babu) త్రివిక్రమ్ కాంబోలో SSMB28 సినిమా, బాలయ్య (Balakrishna)-అనిల్ కాంబోలో సినిమా, హరీష్ శంకర్ (Harish Shankar) - పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh ) సినిమా, నితిన్ 32వ సినిమాలో, రామ్ బోయపాటి మూవీ లో ఇంకా పంజా వైష్ణవ తేజ్ 4వ సినిమాలో, కిరిటీ రెడ్డి హీరోగా లాంచ్ అవుతున్న సినిమాలో, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రోజు సినిమాలలో ఈమె నటిస్తుంది.మొత్తం మీద ఇన్ని సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ డేట్స్ మాత్రం క్లాష్ అవకుండా పక్కా ప్రణాళికతో ముందుకు పోతుంది.మరి వీటిలో చాలా వరకు సక్సెస్ అయ్యేట్టుగానే కనిపిస్తున్నాయి.
కుర్ర హీరోల సినిమాలు పక్కన పెడితే స్టార్ హీరోల సినిమాలు మాత్రం పక్కా హిట్ అయినట్టే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy