ఇదొక అద్భుత ప్రయాణం.. అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న శ్రీజ?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi )చిన్న కుమార్తె శ్రీజ( Sreeja ) గురించి అందరికీ సుపరిచితమే ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ భారీ స్థాయిలో తన వ్యక్తిగత విషయాల వల్ల పాపులర్ అయ్యారు.

శ్రీజ ముఖ్యంగా తన పెళ్లిల విషయంలో ఈమె తరచు వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చి తన ఇద్దరి కూతుర్లతో కలిసి ఉంటున్నారు.ప్రస్తుతం తన కుమార్తెల బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు శ్రీజ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు.

ఇప్పటికే పలు బిజినెస్లను నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈమె తాజాగా ఫిట్నెస్ సెంటర్( Fitness Center ) కూడా ప్రారంభించారు.ఈ క్రమంలోనే తన కొత్త బిజినెస్ గురించి శ్రీజ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ శుభవార్తను అందరితో పంచుకున్నారు.ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.

కొత్త వెంచర్ గురించి చెప్పడం ఎంతో ఆనందంగా ఉంది.ఇదొక అద్బుతమైన కొత్త ప్రయాణం అంటూ శ్రీజ కొణిదెల తన కొత్త బిజినెస్ గురించి తెలిపింది.

Advertisement

స్టూడియో అనంత( Studio Ananta ) అంటూ ఓ ఫిట్ నెస్ సెంటర్‌ను ప్రారంభించారు.ఇక మనసుకు, శరీరానికి ప్రశాంతత కలిగిస్తారట.జిమ్, యోగా, ఇతరత్రా కార్యక్రమాలన్నీ ఉంటాయని తెలుస్తోంది.

శనివారం ఈ కార్యక్రమాన్ని పలువురు సినీ సెలబ్రిటీలు తన సన్నిహితుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు శ్రీజకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక ఈమె తన రెండో భర్త కళ్యాణ్ దేవ్( Kalyan Dev )కి విడాకులు ఇచ్చి తన భర్తకు దూరంగా ఉన్నప్పటికీ ఈ విషయాలను మాత్రం అధికారకంగా ప్రకటించలేదని చెప్పాలి.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు