Sree Vishnu Samajavaragamana : హమ్మయ్య.. వరుస ఫ్లాపుల తర్వాత శ్రీ విష్ణు కి ఒక హిట్ వచ్చేసింది..! 

ఒక సినిమా హిట్ అవ్వాలంటే దానికి విపరీతమైన హైప్ క్రియేట్ అవ్వాల్సిన అవసరం లేదు.

ఒకవేళ క్రియేట్ అయిన సినిమాలు కూడా మ్యాటర్ లేకపోతే రెండో రోజు థియేటర్ లలో ఉండడం లేదు.

సినిమా హిట్ అవ్వాలంటే కంటెంట్ లో దమ్ము ఉండాలి.దానికి తగ్గట్టుగానే మౌత్ పబ్లిసిటీ కూడా ఉండాలి.

కాంతారా లాంటి సినిమాలు మొదటి రోజు థియేటర్లలో వచ్చిన టాక్ తర్వాతే మిగతా భాషల్లో కూడా బస్సు పెరిగి హైయెస్ట్ రేట్ కి అమ్ముకున్నారు.ఇక ఇప్పుడు ఈ లిస్టులో శ్రీ విష్ణు తాజాగా నటించిన సామజవరగమన( Samajavaragamana ) కూడా వచ్చి చేరింది.

చాలా రోజులుగా ఒక మంచి సాలిడ్ హిట్టు కోసం శ్రీవిష్ణు తహాతహా లాడుతున్నాడు అందుకు తగ్గట్టుగానే సామజవరగమన చాలా క్లీన్ అండ్ నీట్ సినిమా అని అనిపించుకుంది.

Advertisement

కథలో కాస్త వెరైటీ ఉంది కాబట్టి ప్రేక్షకులు కూడా ఆ సినిమాని బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు.అయితే ఇది మామూలు హిట్ అవుతుందా లేదా పెద్ద హిట్ అవుతుందా తెలియాలంటే ఈ వారం రోజులు వేచి చూడాల్సిందే.సినిమాలో కథ బాగుంది కానీ సంగీత పరంగా కాస్త లోపాలు ఉన్నాయి.

కామెడీ పరంగా వెన్నెల కిషోర్( Vennela Kishore ) చాలా రోజుల నుంచి నవ్వించలేకపోతున్నాడు కానీ ఈ చిత్రంలో చాలా రోజుల తర్వాత పాత వెన్నెల కిషోర్ ని చూసిన ఫీలింగ్ వస్తుంది.ఇక సామజవరగమన సినిమాకి కచ్చితంగా డైలాగ్స్ బలం అని చెప్పాలి.

హీరోయిన్ రెబ కూడా పరవాలేదనిపించింది.

మొత్తానికి ఈ సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా అని మాత్రం చెప్పవచ్చు.మొత్తం సినిమాలో నరేష్ మరియు శ్రీ విష్ణు( Sree Vishnu ) నటన హైలెట్ అని చెప్పవచ్చు తండ్రి కొడుకులుగా వీరిద్దరి నటన అద్భుతంగా ఉంది నరేష్ కామెడీ రూల్స్ తో పాటు సీరియస్ రోడ్స్ కూడా చక్కగా చేయగల నటుడు చాలా చక్కటి పాత్ర పండింది ఈ సినిమాలో.వందల కోట్ల ఆస్తి డిగ్రీ పాస్ కాకుండా ఉండడంతో తనకు దక్కదు అనే పాత్రలో నరేష్ కామెడీ( Naresh Comedy ) చక్కగా చేశాడు.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

ఇక తండ్రి నీ పాస్ చేయించే పనిలో శ్రీ విష్ణు కూడా బాగానే పెర్ఫార్మ్ చేశాడు.ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క మేకర్ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కథలో కొత్తదనం అయినా ఉండాలి లేదా పాత కథనే కొత్తగా చూపించడం తెలిసి ఉండాలి.

Advertisement

ఈ రెండు చేయకపోతే ఒక్కరోజు కూడా థియేటర్లో సినిమా ఉండదు.ఈ సూత్రాన్ని బాగా నమ్మిన దర్శకుడు సినిమాను చాలా చక్కగా ప్రజెంట్ గా తెరపై చూపించాడు.

తాజా వార్తలు