నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ).నటుడిగా, రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా అనేక బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా పోషించారు.
చాలా మంది ఆయన చరమాంకంలో రెండో పెళ్లి చేసుకోవడం ద్వారానే అబాసపాలు అయ్యారని అంటూ ఉంటారు.లక్ష్మీపార్వతి( Lakshmi Parvati ) ఆయన జీవితంలో ప్రవేశించిన తర్వాత ఆయన పాతాళానికి తొక్కబడ్డారు సొంత వారి చేతిలోనే మోసపోయారు చివరికి ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా పక్కకు తీసేసారు.
అయినా మళ్ళీ రచ్చ గెలిచే ఇంట గెలిచారు.ఎన్నికలకు వెళ్లి ప్రజల ఆమోదంతో ముఖ్యమంత్రిగా గెలిచి అందరి నోళ్లు మోహించారు.
క్రమశిక్షణకు మారుపేరుగా నందమూరి తారక రామారావుకి మొదటి నుంచి మంచి పేరు ఉంది.ఎన్టీఆర్ కి ఏడుగురు కుమారులు ఉండగా నలుగురు కుమార్తెలు ఉన్నారు.
జీవితంలో ఆయన క్రమశిక్షణ వల్లనే హీరోగా ఎదిగాడు, నాయకుడిగా కూడా ఎదిగాడు.ఆయన క్రమశిక్షణను పిల్లలకు కూడా అలవాటు చేశాడు.అన్నేళ్లపాటు ఆయన సీఎంగా ఉన్నప్పటికీ కూడా ఏ రోజు సచివాలయం మొహం కూడా చూసి ఎరగరు ఆయన పిల్లలు.
ఎక్కడ అవినీతిలో కానీ తప్పుడు వ్యవహారాల్లోనూ వాళ్ళు వేలు పెట్టిన సందర్భాలు లేవు.
నాటి నుంచి నేటి వరకు ఆయన వారసులకు ఇచ్చింది ఆస్తులు మాత్రమే కాదు క్రమశిక్షణ కూడా.ఒకరోజు కూడా నందమూరి తారక రామారావు పిల్లల గురించి చెడుగా పేపర్లలో రావడం చూసి ఉండము అలాంటి సత్ప్రవర్తన కలిగిన పిల్లలు ఎంతమందికి ఉన్నారు చెప్పండి ఆయన తరంలో చాలామంది హీరోల పిల్లలు రకరకాల విషయాల్లో వార్తల్లోకి ఎక్కిన వారే.
ఇక కేవలం కొడుకులు మాత్రమే కాదు కుమార్తెలు కూడా ఇంటి గడప దాటి బయటకు ఏ రోజు వెళ్లేవారు కాదు.వారికి ఏది కావాలన్నా కూడా అన్ని ఇంటికి వచ్చేవి.ఆఖరికి ఒక చీర కొనుక్కోవాలన్నా కూడా తండ్రి అనుమతి లేకుండా కొనేవారు కాదు అంతటి క్రమశిక్షణ కలిగిన పిల్లలని ఎక్కడా చూడలేము.
తోటి స్టార్ హీరోల పిల్లలు లక్షల ఖరీదైన బట్టలు కొనుక్కున్న ఎంతటి లగ్జరీ వాహనాల్లో తిరిగినా కూడా తమకు ఇలాంటివి కావాలి అని ఏ రోజు తన నాన్న దగ్గర అడిగిన పాపాన పోలేదు.ఎన్టీఆర్ మాత్రమే కాదు పిల్లలకు క్రమశిక్షణ అలవాటు చేయడంలో ఆయన భార్య బసవతారకం కూడా ముఖ్యపాత్ర పోషించారనే చెప్పాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy