ఎన్టీఆర్ కొడుకుల్లో ఎవరెవరు ఏ వృత్తి లో స్థిరపడ్డారు ?

చాలా మందికి ఎన్టీఆర్ కుమారులు తెలుసు, కానీ ఎవరెవరు ఏ రంగాల్లో స్థిరపడ్డారు అన్న విషయం పై క్లారిటీ లేదు.

అందుకే ఈ ఆర్టికల్లో ఎన్టీఆర్ కుమారుల అభివృద్ధి పై పూర్తి వివరాలను తెలియజేసే ప్రయత్నం మీకోసం.

తను మాత్రమే కాకుండా తన వారసులు కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవ చేయాలనే తలంపు ఎన్టీఆర్ కి ఎప్పుడు ఉండేది.అందుకే వారి బిడ్డలు ముగ్గురు తమ భవిష్యత్తును సినిమా పరిశ్రమకే అంకితం చేశారు.

నా బిడ్డలు కేవలం నా ఆస్తికి మాత్రమే వారసులుగా కాక నటనా పరంగా కూడా వారసులుగా నిలవాలని నా కోరిక అని ఎప్పుడు చెప్పేవారాయన.ఇక 50 ఏళ్ళ వయసులో కూడా రోజుకు 20 గంటలు పనిచేసిన ఘనత ఎన్టీఆర్ కి మాత్రమే చెల్లింది.

Sr Ntr Sons Wherabouts, Nandamuri Harikrishna, Nandamuri Balakrishna, Junior Ntr

ఇక ఆయన మాటల్లో.నాకు ఏడుగురు కొడుకులు ఉన్నారు, వారి జీవితాలకు నా జీవితం మార్గదర్శకంగా ఉండాలి.క్రమశిక్షణతో నా పిల్లలు తమ కర్తవ్యాన్ని తెలుసుకొని జీవించడం కోసమే నేను ఇంత శ్రమిస్తున్నాను.

Advertisement
Sr Ntr Sons Wherabouts, Nandamuri Harikrishna, Nandamuri Balakrishna, Junior NTR

ఆస్తి లేకపోయినా నా వెంట ఏడుగురు కొడుకులు ఉన్నారన్న ధైర్యం నాకుంది.అర్థ బలం కాదు అంగ బలం కావాలి మనిషి కి అని కూడా చెప్పేవారు ఎన్టీఆర్.

ఆయన ఆశించినట్లుగానే ఆయన బిడ్డలందరూ క్రమశిక్షణతో మెలుగుతూ పెరిగి పెద్దవారై తండ్రికి తగిన తనయులుగా పేరు తెచ్చుకున్నారు.వీళ్ళలో నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ ఆయన నట వారసులుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తండ్రి పేరును నిలబెట్టారు.

Sr Ntr Sons Wherabouts, Nandamuri Harikrishna, Nandamuri Balakrishna, Junior Ntr

నందమూరి మోహనకృష్ణ మాత్రం సాంకేతిక రంగంలోకి అడుగుపెట్టి అద్భుతమైన ఛాయాగ్రాహకుడిగా పేరు తెచ్చుకున్నారు.ఇక తండ్రి క్రమశిక్షణకు వారసుడైన నందమూరి రామకృష్ణ నిర్మాణ రంగంలోకి ప్రవేశించి స్టూడియో నిర్వహణ బాధ్యతలు మరియు చిత్ర నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.మిగిలిన తనయులు తండ్రి ఇచ్చిన ఆస్తితో వివిధ రంగాల్లో స్థిరపడ్డారు.

నందమూరి వంశానికి వన్న తెచ్చి పెద్దాయన ప్రతిష్ట ఇనుమడింప చేస్తున్న నట వారసులుగా వీరు చరిత్రలో నిలిచిపోయారు.ఇక మరొక తరంగా నందమూరి మనవలు అయినా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న వంటి వారు ఇండస్ట్రీకి వచ్చిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే.

ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?
Advertisement

తాజా వార్తలు