నటుడు సోమయాజులు జీవితాన్ని ఎన్టీఆర్ ఎలా దెబ్బ తీశారు

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయం మనకు తెలియకుండానే వేరే వాళ్ళ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

అలాంటి ఒక సంఘటనే సీనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ అలాగే జే వి సోమయాజులు విషయంలోనూ జరిగింది.

శంకరాభరణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రను వేసుకున్న సోమయాజులు ఆ సినిమా పేరు నే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు.సినిమాల్లో నటించడానికి ముందే నాటక రంగంలో ప్రవేశించి ఆ తర్వాత బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా అంతటా తనదైన మార్కు చూపించుకున్నారు.1928 జనవరి 30వ తారీఖున శ్రీకాకుళంలో సోమయాజులు జన్మించారు.ఆయన సోదరుడు రమణమూర్తి ఇద్దరు కలిసి నాటకాల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు.

ఆ తర్వాత ఇద్దరు సినిమా రంగం లో కూడా కొన్నాళ్లపాటు ఉన్నారు.విజయనగరంలో సోమయాజులు చదువుకున్న రోజుల నుంచి నాటకాలు వేసేవారు.

తన తల్లి ప్రోత్సాహంతో గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కంలో సోమయాజులు వేసిన పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది ఆ నాటకం 40 ఏళ్లలో 500 సార్లు ప్రదర్శించబడింది.

Advertisement

మొదట చిన్న చిన్న పాత్రల్లో నటించిన శంకరాభరణం ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులను దక్కేలా చేసింది.ఆ తర్వాత బాపు దర్శకత్వంలో నటించిన వంశవృక్షం సినిమా ఆయనకు మరింత పేరును సంపాదించింది.సోమయాజులు నటనతోనే కాకుండా తనదైన బేస్ వాయిస్ తో కూడా అభిమానులను సంపాదించుకున్నారు.

తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం కూడా ఒకరకంగా సోమయాజులికి కలిసొచ్చింది అని చెప్పాలి.

ఓవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే సినిమాల్లోనూ నాటకాల్లోనూ అలాగే బుల్లితెరపై సీరియల్స్ లోను నటించేవారు.150 సినిమాలకు పైగా నటించిన తర్వాత తన 55 ఏళ్ల వయసులో సీనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఒక నిర్ణయం సోమయాజులు జీవితాన్ని కుడించింది అనే చెప్పాలి.55 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేయాలని అనే ఎన్టీఆర్ నిర్ణయం తో అనేక మంది తమ ఉద్యోగాలను వదులుకోవాల్సి వచ్చింది.అలా రాష్ట్ర సాంస్కృతిక శాఖకు డైరెక్టర్ పదవి నుంచి వేటు వేయడంతో ఆయన కాస్త ఇబ్బందులకు గురయ్యారు.

ఆంధ్ర యూనివర్సిటీ సోమయాజులు కి మరొక గౌరవాన్ని ఇచ్చింది.తమ యూనివర్సిటీలో రంగస్థలం శాఖకు సోమయాజులని అధిపతిగా నిర్ణయించడంతో ఆయన పరిధిలో అనేక నాటకాలు ప్రదర్శించబడ్డాయి.

వైరల్ : తల్లిదండ్రుల ప్రేమకు మించి మరొక ప్రేమ లేదనడానికి ఇదే ఉదహరణ కాబోలు..
Advertisement

తాజా వార్తలు