AC లో ఎక్కువగా గడుపుతున్నారా? అయితే ఇది మీ కోసమే

వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి.ప్రతి ఒక్కరు ఎండలో బయటకు రాకుండా AC గదుల్లో గడిపేస్తున్నారు.

అయితే ఆలా ఎక్కువగా AC లో గడపటం వలన అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

Spending Too Much Time On Ac But This Is For You Ac-AC లో ఎక్కు�

AC లో ఎక్కువగా గడిపేవారికి చర్మం పొడిగా మారుతుంది.AC లో కూర్చొని ఒక్కసారిగా ఎండలోకి వెళ్ళితే ఈ సమస్య బాగా పెరుగుతుంది.

పొడి చర్మ తత్త్వం కలవారైతే ఈ సమస్య ఎక్కువ అవుతుంది.కళ్ళు పొడిగా ఉండేవారు AC లో ఎక్కువగా ఉండకూడదు.

Advertisement

AC లో ఉండుట వలన కంటిలో ద్రవాలు పరిమాణం తగ్గి కళ్ళు పొడిగా మారతాయి.కళ్ళు పొడిబారే సమస్య ఉన్నవారు అసలు AC లో ఉండకూడదు.

ఒకవేళ ఉంటే సమస్య ఎక్కువ అవుతుంది.AC గదుల్లో తేమ శాతం తక్కువగా ఉండుట వలన డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.

విపరీతమైన దాహం అవుతుంది.AC లో ఎక్కువగా ఉండటం వలన ముక్కు, గొంతు, కళ్లు మరియు శ్వాస కోశ వ్యాధులు వస్తాయి.

ముక్కు రంద్రాలు మూసుకుపోయి ముక్కు లోపలి భాగంలో ఉండే మ్యూకస్ పొర వాపునకు గురి అయ్యి ఇన్ ఫెక్షన్ కి దారి తీస్తుంది.ఆస్తమా, అలర్జీలు ఉన్నవారు ఏసీల్లో అస్సలు ఉండరాదు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

లేదంటే సమస్య మరింత ఎక్కువవుతుంది.AC గదుల్లో ఎక్కువగా గడిపే వారికి ఎక్కువగా తలనొప్పి వస్తుంది.

Advertisement

అది మైగ్రేన్ కి కూడా దారి తీయవచ్చు.

తాజా వార్తలు