అప్పుడు 100 రూపాయలు.. ఇప్పుడు రూ.300 కోట్లు.. బన్నీ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) మొదట విజేత, స్వాతిముత్యం సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత డాడీ సినిమాలో చిన్న పాత్రలో తలుక్కున మెరిశాడు.

ఇకపోతే అల్లు అర్జున్ కు డాన్స్ అంటే పిచ్చి అన్న విషయం అందరికీ తెలిసిందే.

అల్లు అర్జున్ డాన్స్ లో చాలా క్రేజ్,గ్రేస్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ లో ఉన్న మెరుపుని దర్శకుడు రాఘవేంద్రరావు( Director Raghavendra Rao ) గుర్తించి అతని తల్లికి వంద రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పెద్దయ్యాక మీ అబ్బాయిని నేను హీరో చేస్తానని మాట ఇచ్చారట.

చెప్పినట్టుగానే గంగోత్రి సినిమాతో( Gangotri Movie ) అల్లు అర్జున్ ని హీరోగా పరిచయం చేశారు.అది సినిమాలపరంగా మొదటి సంపాదన కావడంతో ఆ నోటును అల్లు అర్జున్ దాటు దాచుకున్నారట.

అప్పటికే రాఘవేంద్రరావుకి అది 100వ సినిమా.

Advertisement

గంగోత్రి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు అల్లు అర్జున్.మొదటి సినిమాతో భారీ విజయం అందుకున్నప్పటికీ ఏడాది పాటు ఖాళీగానే ఉన్నారట.అప్పుడే సుకుమార్ అల్లు అర్జున్ ని పిలిచి ఆర్య( Arya ) కథ వినిపించారట.

అలా బన్నీ లోని అసలైన డ్యాన్సర్‌ని చూపించేందుకు ఆ చిత్రం ఓ వేదికగా నిలిచింది.ఆయన డ్యాన్స్‌, ఫ్రెష్‌ లవ్‌స్టోరీ, మ్యూజిక్‌ ఇలా అన్నీ యువతను కట్టిపడేశాయి.

తర్వాత నటించిన బన్నీ సినిమా మాస్‌ ఆడియన్స్‌ కు దగ్గర చేసింది.

దేశముదురు లో హైపర్‌ యాక్టివ్‌ రోల్‌ డిమాండ్‌ మేరకు తొలిసారిగా సిక్స్‌ప్యాక్‌ తో కనిపించి ట్రెండ్‌ సెట్‌ చేశారు.అక్కడి నుంచి ప్రతీ సినిమాకు విభిన్న క్యారెక్టర్స్‌ చేస్తూ తనకంటూ ప్రత్యేక అభిమాన గణాన్ని కాదు.ఆర్మీని సొంతం చేసుకున్నారు.

2025 లో మెగా హీరోలు తమ సత్తా చాటబోతున్నారా..?
నాని నిర్మాణంలో మెగాస్టార్ చిరు...డైరెక్టర్ ఎవరో తెలుసా?

ఆ విధంగా అల్లు అర్జున్ చాలా కష్టపడి పైకి వచ్చారు.ఇక అల్లు అర్జున్ నటించిన చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి కొన్ని ఫెయిల్ కూడా అయ్యాయి.

Advertisement

ఆ తర్వాత మళ్లీ సుకుమార్, బన్నీ కాంబినేషన్లో ఆర్య 2 సినిమా విడుదల అయింది.ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమా వచ్చింది.2021 డిసెంబరు 17న బాక్సాఫీసు ముందుకొచ్చిన పుష్ప 1 అంచనాలు దాటేసి దాదాపు రూ.360 కోట్లు వసూళ్లు రాబట్టింది.అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందించింది.

టాలీవుడ్‌లో ఆ పురస్కారం పొందిన ఏకైక నటుడు బన్నీ.కాగా అల్లు అర్జున్‌కు మాలీవుడ్‌లోనూ ఫాలోయింగ్‌ ఎక్కువే.

ఆ ఫ్యాన్సే ముద్దుగా మల్లు అర్జున్‌ అని పిలుచుకుంటున్నారు.ఆర్య సినిమా నుంచి చాలా సినిమాలు మలయాళంలో డబ్‌ అయ్యాయి.

ఉత్తరాది ప్రేక్షకులు బన్నీ సినిమాలను విశేషంగా ఆదరించారు.అలా ఒకప్పుడు బన్నీ ₹100 తో తన సినీ ప్రస్థానంని మొదలుపెట్టి నేడు ఒక్కొక్క సినిమాకు దాదాపుగా 300 కోట్లు అందుకుంటున్నారు.

ఇది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పాలి.

తాజా వార్తలు