నేను ఎవరిని తొక్కలేదు.. ఆ మాటలు అన్ని అబద్ధాలు : బాలు

ఎస్పీ బాల సుబ్రమణ్యం.ఈ పేరు ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

గాన గంధర్వుడిగా సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో వేల సంఖ్యలో పాటలు పాడి యెనలేని ఖ్యాతిని సొంతం చేసుకున్నారు.అయితే ఆయన కరోనా కాలం ఎంతో మంది లెజెండ్స్ ని పరిశ్రమ కోల్పోయింది.

బాలు గారిని కూడా కరోనా మింగేసింది.కానీ ఆయన పాటలు మాత్రం ఇప్పటికి ఎప్పటికి శ్రోతలను మంత్ర ముగ్ధుల్ని చేస్తూనే ఉంటాయి.

అయితే గతంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇప్పటికి వైరల్ అవుతూనే ఉంటాయి.ఒకానొక సందర్భంలో ఇండస్ట్రీ లో ఎవరిని ఎదగకుండా చేశారు అనే అపవాదు బాలు మూటగట్టుకున్నారు.

Advertisement
Sp Balu About Tumors On Him , Sp Balu, SP Bala Subramaniam, Tollywood, Singer, N

ఈ విషయం పై బాలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Sp Balu About Tumors On Him , Sp Balu, Sp Bala Subramaniam, Tollywood, Singer, N

ఎన్టీఆర్, అక్కినేని, శోభన్ బాబు నుంచి ఆయన కన్ను మూసే వరకు బాలు పాట లేని సినిమా ఉండేది కాదు.బాలుకు వచ్చే పేరు ప్రఖ్యాతులు తట్టుకోలేక ఎంతో మంది ఆయనపై వదంతులు సృష్టించే వారు అంటూ బాలు సదరు వ్యాఖ్యలను కొట్టి పారేశారు.తనకు 45 ఏళ్ల పాటు కొన్ని వేల పాటలు పాడిన అనుభవం వచ్చింది అంటే తనతో పాటలు పాడించుకున్న వారు ఏమైనా మతి భ్రమించి పెట్టుకున్నారా ? అంటూ బాలు ప్రశ్నించారు.ఇప్పుడు వందల్లో కొత్త సింగర్స్ వస్తున్నారు.

నా కన్న కూడా ఎంతో బాగా పాడుతున్నారు.అయిన కూడా నేను పాడాల్సిన పాటలు ఇప్పటికి నేనే పాడుతున్నాను.

Sp Balu About Tumors On Him , Sp Balu, Sp Bala Subramaniam, Tollywood, Singer, N

నా పైన రూమర్స్ సృష్టించే వారిని చూస్తే చాలా జాలి వేస్తుంది.తెలుగు లో నేను తొక్కేసాను అనుకుంటే మరి ఇండియాలో అనేక భాషల్లో కూడా టాప్ సింగర్ గా నాలుగు దాబ్దాలపాటు కొనసాగుతున్నాను అంటే అక్కడ వారిని కూడా నేను తొక్కేసానా ? నేను అర్హత ఉన్న సింగర్ నీ కాబట్టి పిలిచి అవకాశాలు ఇచ్చారు.ఇందులో ఎవరిని ప్రలోభ పెడితే అవకాశాలు ఇవ్వరు.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

కేవలం టాలెంట్ మాత్రమే మనల్ని గుర్తించేలా చేస్తుంది.నేను ఎంతో కష్టపడ్డాను పైకి ఎదిగాను ఇందులో ఎవరిని ఎడగనివ్వక పోవడం అనేది పచ్చి అబద్దం అంటూ బాలు ఘాటుగా స్పందించారు.

Advertisement

తాజా వార్తలు