ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. విస్తారంగా వర్షాలు.!

అన్నదాతలు ఎంతగానో ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు( Southwest Monsoon ) ఏపీలోకి ప్రవేశించాయి.

ఈ క్రమంలో మూడు రోజుల ముందుగానే అనంతపురం జిల్లాను నైరుతి రుతుపవనాలు తాకాయి.

రానున్న రెండు రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది.దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.

రుతుపవనాల రాకతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వడగాల్పులు తగ్గుముఖం పట్టాయి.నేడు ఉత్తర కోస్తా, రాయలసీమ( Rayalaseema) జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు