జాతీయ పార్టీకి ద‌క్ష‌ణాది సెంటిమెంట్..! కేసీఆర్ మ‌ళ్లీ అదే వ్యూహం..!!

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై క్లారిటీ ఇచ్చేశారు.రెపో మాపో ముఖ్య నేత‌ల స‌మావేశం నిర్వ‌హించి పూర్తి వివ‌రాలు కూడా ప్ర‌క‌టించ‌నున్నాడు.

ఇప్ప‌టికే దేశంలో బీజేపీ, కాంగ్రెస్ యేత‌ర పార్టీల నేత‌ల‌తో భేటి అయ్యారు.రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ రావడంతోనే కేసీఆర్ త‌మ‌ పార్టీ ముఖ్య నేతలతో అత్యవసరంగా స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సమావేశంలోనే జాతీయ పార్టీ ఏర్పాటుపై సంచలన నిర్ణయం తీసుకున్నారు.అంతే కాకుండా కొత్త పార్టీ పేరుపైనా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

భార‌తీయ రాష్ట్ర సమితీ లేదా భారత్‌ రాష్ట్రీయ సమితి పేరును త్వరలోనే రిజిస్టర్‌ చేయించనున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం.అయితే కేసీఆర్ జాతీయ పార్టీపై ప్ర‌స్తుతం తీవ్ర రాజ‌కీయ చ‌ర్చ జ‌రుగుతోంది.

Advertisement

అయితే దేశంలో మ‌రో జాతీయ పార్టీ ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతుంద‌నేదానిపై చ‌ర్చ మొద‌లైంది.తెలంగాణ ఉద్య‌మ నాయ‌కుడిగా, రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న కేసీఆర్ జాతీయ స్థాయిలో రాణించగలరా.

అనే సందేహాలు లేక‌పోలేదు.అయితే కేసీఆర్ జాతీయ పార్టీ ఆలోచ‌న ఎక్క‌డిది.

అందుకు త‌న‌కు స‌హ‌క‌రిస్తున్న ప‌రిస్థితులేంటి అన్నది తెలియాల్సి ఉంది.అయితే మొద‌టి నుంచి కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ యేత‌ర ప్ర‌భుత్వం దేశంలో అధికారంలోకి రావాల‌ని బ‌లంగా కోరుకుంటున్నారు.

అందుకే గ‌తంలో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ దేశ వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌లు చేశారు.కీల‌క నేత‌ల‌నూ క‌ల‌సి పెద్ద దుమారం లేపారు.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

అయితే కొన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ లేకుండా మ‌రో పార్టీ దేశంలో అధికారంలోకి రాద‌నే న‌మ్మ‌కంతో కేసీఆర్ తో క‌లిసి రాలేదు.ఇక ఆ త‌ర్వాత కేసీఆర్ కూడా త‌న ప్లాన్ మార్చారు.

Advertisement

ఏకంగా జాతీయ పార్టీ పెడ‌తాన‌ని చెప్పి సంచ‌ల‌నం సృష్టించారు.ఇటీవల కేసీఆర్ పలు ప్రాంతీయ పార్టీల నేతలతో మంత‌నాలు జ‌రిపారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం మాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపారు.మాజీ ప్రధాని దేవేగౌడ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోనూ భేటీ అయ్యారు.

గతంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో కూడా చర్చలు జరిపారు.అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని స‌మాచారం.

అయితే వీళ్లంద‌రితోనూ జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ చర్చించిన‌ట్లు తెలుస్తోంది.ఏ ధైర్యంతో కేసీఆర్ ముందడుగు వేస్తున్నారో కానీ ప్రాంతీయ పార్టీల్లో కేసీఆర్ కు చివరి వరకు ఎంత‌మంది మద్దతుగా ఉంటారో కూడా వేచి చూడాలి.

అయితే ప్రాంతీయ వాదాన్ని ర‌గిల్చి సెంట్ మెంట్ తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ స‌క్సెస్ కి ద‌క్ష‌ణాది సెంటిమెంట్ తేవ‌నెత్తుతున్నారు.అందుకే సౌత్ నేత‌ల‌తో కేసీఆర్ ట‌చ్ లో ఉంటూ ప‌ట్టు సాధిస్తున్నాడు.ద‌క్ష‌ణాదికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని బ‌లంగా వినిపించి గ‌ట్టెక్కాల‌ని చూస్తున్నారు.

దేశంలో బీజేపీ మ‌త‌ప‌ర‌మైన రాజ‌కీయాలు చేస్తోంద‌ని.ఇక కాంగ్రెస్ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని సౌత్ నుంచి వినిపించాల‌ని చూస్తున్నారు.

అయితే కేసీఆర్ దేశ్ కి నేత.జాతీయ పార్టీగా స‌క్సెస్ కావాల‌న్నా ప్రాంతీయ పార్టీలు ఎంత వ‌ర‌కు స‌హ‌క‌రిస్తాయో వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు