బాలీవుడ్ కు వరుసగా మూడు షాకులు తగిలాయిగా.. ఇక్కడితో ఆగదంటూ?

కొన్నేళ్ల క్రితం వరకు టాలీవుడ్ స్టార్ హీరోలు బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది.

జక్కన్న డైరెక్షన్ లో పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈగ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే.

ఇదే బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ కాగా అక్కడ ఈ సినిమాను ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.అయితే వరుసగా మూడు సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి.

అదే సమయంలో సౌత్ ఇండియాలో మాత్రం బాలీవుడ్ సినిమా ఏదీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.గతేడాది డిసెంబర్ నెల 17వ తేదీన పుష్ప ది రైజ్ హిందీలో విడుదల కాగా ఆ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది.

పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే హిందీలో ఈ సినిమా విడుదల కాగా ఈ సినిమాకు ఏకంగా 108 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.పుష్ప మూవీని హిందీలో విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్ కు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వచ్చాయి.

Advertisement

ఆ సినిమా ఇచ్చిన షాక్ నుంచి బాలీవుడ్ కోలుకోక ముందే ఆర్ఆర్ఆర్ మూవీ బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలై సంచలనాలను సృష్టించింది.

ఆర్ఆర్ఆర్ మూవీ హిందీలో ఏకంగా 240 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.విడుదలై చాలా రోజులైనా ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వస్తుండటం గమనార్హం.మరోవైపు కేజీఎఫ్2 సినిమా విడుదలై బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.

ఈ సినిమా బాలీవుడ్ లో ఫస్ట్ డే రికార్డులను బ్రేక్ చేసి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది.ఫుల్ రన్ లో కేజీఎఫ్2 కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నయో చూడాల్సి ఉంది.కేజీఎఫ్2 సక్సెస్ తో కన్నడ ఇండస్ట్రీలో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది.ఈ విజయాలు ఇక్కడితో ఆగవని భవిష్యత్తులో మరిన్ని సౌత్ సినిమాలు బాలీవుడ్ లో సత్తా చాటుతాయని ప్రచారం జరుగుతోంది.

బిడ్డకు అన్నప్రాసన కార్యక్రమం ఏ సమయంలో చేయాలో తెలుసా..!
Advertisement

తాజా వార్తలు