డ్రగ్స్ కేసులో చిక్కిన హీరోయిన్ కి 14 రోజుల రిమాండ్... కానీ....

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాదక ద్రవ్యాల వినియోగం మరియు సరఫరా కేసు తెగ కలవరపెడుతోంది.

నిన్న మొన్నటి వరకూ బాలీవుడ్, శాండిల్ వుడ్  సినిమా పరిశ్రమల్లో ఈ డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా కేసు ఎంతగా కలకలం సృష్టించిందో కొత్తగా సినీ ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు.

 అయితే ఇప్పుడు ఈ వ్యవహారం టాలీవుడ్ సినిమా పరిశ్రమకి నట్లు తెలుస్తోంది.ఇటీవలే పలు తెలుగు చిత్రాలలో సెకండ్ హీరోయిన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించిన తెలుగు నటి శ్వేతా కుమారి ముంబైలోని ఓ హోటల్లో మాదక ద్రవ్యాలను తీసుకుంటూ పోలీసులకు చిక్కిన సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో తాజాగా పోలీసులు శ్వేత కుమారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.దీంతో శ్వేత కుమారిని 14 రోజుల పాటు రిమండులో ఉంచి విచారించాలని కోర్టు వారు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో పోలీసులుశ్వేతా కుమారిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.అయితే తాజా సమాచారం ప్రకారం శ్వేతా కుమారికి డ్రగ్స్ వ్యవహారంతో పాటు పలు సుపారీ కిల్లింగ్ గ్యాంగ్స్ మరియు గ్యాంగ్ స్టర్ గ్రూపులతో కూడా సంబంధాలు ఉన్నట్లు కొందరు చర్చించుకుంటున్నారు.

Advertisement
South Actor Shwetha Kumari Remanded To 14-day Judicial Custody, Shwetha Kumari,

  కానీ శ్వేతా కుమారి తెలుగులో నటించినటువంటి చిత్రాలలో ఒక్క చిత్రం కూడా విడుదలైనట్లు ప్రేక్షకులకి తెలియదు.

South Actor Shwetha Kumari Remanded To 14-day Judicial Custody, Shwetha Kumari,

కానీ ఈమె హైదరాబాద్ నుంచి ముంబైకి మాదక ద్రవ్యాల కోసం వెళ్లడంతో టాలీవుడ్ పేరుని కొందరు ఉపయోగిస్తూ సినీ పరిశ్రమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కొందరు సినీ సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే శ్వేతా కుమారి తెలుగులో కంటే కన్నడలోనే ఎక్కువ చిత్రాల్లో నటించిందని పలు ప్రముఖ వెబ్ సైట్లు ఇటీవలే ప్రచురించాయి.దీంతో కొంతమంది నెటిజన్లు  అసలు శ్వేతా కుమారి ఎవరు.? ఈ శ్వేతా కుమారికథ ఏంటో.? అంటూ సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వెతుకుతున్నారు.

Advertisement

తాజా వార్తలు