మరో సారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్...ఏం చేసాడంటే?

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో మనం చూసాం.కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన పరిస్థితి ఉంది.

మొదటి దఫా కరోనా వేవ్ లో భారీగా కరోనా కేసులు నమోదైనా మరణాలు మాత్రం చాలా తక్కువగా నమోదైనాయి.కాని సెకండ్ వేవ్ లో కేసులు భారీగా నమోదైనా మరణాలు కూడా అదే రీతిలో నమోదైన పరిస్థితి ఉంది.

అయితే రెండు వేవ్ లలో సమస్యలు ఎదుర్కొన్న వారికి అండగా ఉన్న ఒకే ఒక వ్యక్తి సోనూసూద్.వెండి తెర మీద విలన్ గా నటించినా తన సేవా కార్యక్రమాలతో అండగా నిలిచి అభాగ్యుల పట్ల అండగా నిలిచారు.

ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకొని ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన పరిస్థితి ఉంది.నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఐఏఎస్ చదువుకోవాలని అనుకుంటారో, ఆర్థిక స్థోమత లేక ఆగిపోతారో వాళ్ళకు అండగా నిలిచేలా ఉచిత ఐఏఎస్ కోచింగ్ సౌకర్యాన్ని కల్పించాడు సోనూసూద్.

Advertisement

ఈ విషయాన్ని తాజాగా సోనూసూద్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలపడం జరిగింది.

ఇక ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.సోనూసూద్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు