చిరంజీవికి ప్రతినాయకుడుగా సోనూసూద్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

ఇక ఇందులో కార్మిక నాయకుడుగా చిరంజీవి కనిపించబోతున్నట్లు తాజాగా బయటకి వచ్చిన ఆయన ఫోటోలు బట్టి తెలుస్తుంది.ఇక ఈ సినిమాని రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Sonu Sood To Be Part Of Chiranjeevis 152nd Film-చిరంజీవికి

కొరటాల గత సినిమాల తరహాలోనే ఇది కూడా ఒక సోషల్ ఎలిమెంట్ కాన్సెప్ట్.ఇక ఇందులో హీరోయిన్ గా త్రిషని ఫైనల్ చేసారని ఇప్పటికే టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో చిరంజీవి ఎదుర్కొనే విలన్ గా బాలీవుడ్ నటుడు, టాలీవుడ్ స్టార్ విలన్ సోనూసూద్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.ఈ విషయాన్ని అతను అధికారికంగా నిర్ధారించారు.

Advertisement

మెగాస్టార్ తో మొదటి సరి కలిసి నటిస్తున్న అని ఓ ఇంటర్వ్యూలో సోనూసూద్ స్పష్టం చేశాడు.టాలీవుడ్ లో ప్రకాష్ రాజ్ తర్వాత ఆ స్థాయిలో స్టార్ విలన్ గా సోనూసూద్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే ఈ మధ్య కాలంలో పెద్దగా తెలుగు సినిమాలు చేయడం లేదు.ఒకటి, రెండు సినిమాలకి మాత్రమే పరిమితం అయ్యాడు.

ఈ నేపధ్యంలో కెరియర్ లో మొదటి సారి అటు కొరటాల, ఇటు మెగాస్టార్ సినిమా చేసే ఛాన్స్ సోనూసూద్ సొంతం చేసుకోవడం విశేషం.

టూత్ పేస్ట్ పళ్లకే కాదు.. ఇలా కూడా వాడొచ్చు!!
Advertisement

తాజా వార్తలు