టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న సోనియా అగర్వాల్( Sonia Agarwal ) తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాజీ భర్త సెల్వ రాఘవన్( Selva Raghavan ) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
డైరెక్టర్ గా సెల్వ రాఘవన్ మొండి పట్టుదల ఉన్న వ్యక్తి అని ఆమె అన్నారు.
కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం అలాంటి వ్యక్తి కాదని సోనియా అగర్వాల్ కామెంట్లు చేయడం గమనార్హం.స్క్రిట్ వర్క్, ఇతర విషయాలలో సెల్వ రాఘవన్ ఎప్పుడూ తనదైన లోకంలో ఉండేవాడని ఆమె చెప్పుకొచ్చారు.
సెల్వ రాఘవన్ తో పర్సనల్ లైఫ్ గురించి ఇక మాట్లాడే ప్రసక్తే లేదని సోనియా అగర్వాల్ తెలిపారు.మేం ఎందుకు విడిపోయామో అతనికి నాకు తెలుసని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఆయన వెళ్తున్న దారిలో ఎంత సంతోషంగా ఉన్నారో నేను కూడా అంతే హ్యాపీగా ఉన్నానని సోనియా అగర్వాల్ వెల్లడించారు.
లైఫ్ లో భార్యాభర్తలుగా విడిపోయిన వాళ్లు తర్వాత రోజుల్లో ఫ్రెండ్స్ గా( Friends ) ఎలా ఉంటారో నాకు అర్థం కావడం లేదని ఆమె కామెంట్లు చేశారు.నా వరకు అయితే అది సాధ్యం కాదని సోనియా అగర్వాల్ చెప్పుకొచ్చారు.అలాంటి పని మాత్రం నేను చేయలేనని సోనియా అగర్వాల్ కామెంట్లు చేశారు.
సెల్వ రాఘవన్ నా కంటికి మళ్లీ స్నేహితుడిగా కనిపించడని ఆమె చెప్పుకొచ్చారు.
పెళ్లి సమయంలో యాక్టింగ్ చేయకూడదని సెల్వ రాఘవన్ కుటుంబం అభ్యంతరం చెప్పిందని ఆమె అన్నారు.అందుకే నేను సినిమాలకు కొంతకాలం బ్రేక్ తీసుకున్నానని సోనియా తెలిపారు.భర్తతో విడిపోయిన తర్వాత నేను సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టానని సోనియా అగర్వాల్ కామెంట్లు చేశారు.7/జీ బృందావన కాలనీ సినిమా సీక్వెల్ ( 7/G Brindavan Colony Movie Sequel )తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy