ఒకేసారి బాబాయి, అబ్బాయితో రొమాన్స్‌

‘లెజెండ్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సోనాల్‌ చౌహాన్‌ ‘పండగచేస్కో’ సినిమాతో ద్వితీయ సక్సెస్‌ను దక్కించుకుంది.

ఈ అమ్మడు ప్రస్తుతం నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ సరసన ‘షేర్‌’ అనే సినిమాలో నటిస్తోంది.

ఆ సినిమా చిత్రీకరణ పూర్తి కావచ్చిన నేపథ్యంలో ఈమెకు మరో నందమూరి హీరో సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కింది.ఒక వైపు అబ్బాయి కళ్యాణ్‌ రామ్‌తో రొమాన్స్‌ చేస్తూనే మరో వైపు బాబాయి బాలకృష్ణతో రొమాన్స్‌కు ఓకే చెప్పింది.

బాలకృష్ణతో ‘లెజెండ్‌’ సినిమా తర్వాత మరో సినిమాలో నటించేందుకు తాజాగా సోనాల్‌ ఓకే చెప్పింది.ఈ అమ్మడు ‘డిక్టేటర్‌’లో సెకండ్‌ హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది.

మొదట ఈ సెకండ్‌ హీరోయిన్‌ పాత్రకు ప్రణీతను ఎంపిక చేసేందుకు దర్శకుడు శ్రీవాస్‌ ప్రయత్నించాడు.కాని ఆమె బిజీగా ఉన్నాను అంటూ నో చెప్పింది.

Advertisement

దాంతో ఇప్పటికే బాలయ్యతో నటించి మెప్పించిన సోనాల్‌ చౌహాన్‌ను మరో సారి ఎంపిక చేయడం జరిగింది.ఇక ఈ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌గా అంజలిని ఎంపిక చేయడం జరిగింది.

ఇటీవలే చిత్రీకరణ ప్రారంభం అయిన ఈ సినిమాను ఇదే సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు