అత్తమామలను హత్య చేసేందుకు అల్లుడు మాస్టర్ ప్లాన్.. కథ అడ్డం తిరగడంతో..?

ఇటీవల కాలంలో చిన్న చిన్న మనస్పర్ధలకు పెద్దపెద్ద దారుణమైన నిర్ణయాలు తీసుకుంటూ తమ కుటుంబాలనే నాశనం చేసుకుంటున్నారు కొందరు మూర్ఖులు.

కుటుంబం అన్నాక చిన్నచిన్న గొడవలు, చిన్న చిన్న మనస్పర్ధలు రావడం సహజం.

ఇవన్నీ సర్దుకొని పోతే కుటుంబం సంతోషంగా ఉంటుంది.లేదంటే కుటుంబాలే నాశనం అవుతాయి.

ఈ ఇలాంటి కోవకు చెందిన ఓ సంఘటన సంగారెడ్డిలో( Sangareddy ) కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.చిన్న చిన్న సమస్యలకే అత్తమామలపై పగ పెంచుకున్న ఓ అల్లుడు ( Son-In-Law ) ఏకంగా అత్తమామలను చంపేయాలని ఓ మాస్టర్ ప్లాన్ చేశాడు.

కానీ కథ అడ్డం తిరగడంతో చివరకు పోలీస్ స్టేషన్లో ఊసలు లెక్కబెడుతున్నాడు.

Advertisement

వివరాల్లోకెళితే.సంగారెడ్డిలో రమేష్ ( Ramesh ) అనే వ్యక్తి తన భార్య తల్లిదండ్రులపై కోపంతో చంపాలని నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలో ఈ నెల 12న ఇంటి తలుపులకు కరెంటు షాక్( Current Shock ) పెట్టి అత్తమామలను లేకుండా చేయాలనుకున్నారు.

అయితే అత్తమామలకు బదులుగా.తల్లి కూతుళ్లు ఆ తలుపులు తాకడంతో కరెంట్ షాక్ తగిలింది.

వెంటనే కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉండే స్థానికులు వచ్చి కరెంట్ ఆఫ్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది.

తరువాత బాధితులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసుల విచారణలో అల్లుడు రమేష్ ఈ కుట్ర చేశాడని తేలింది.అయితే రమేష్ ఈ కుట్ర చేయడం వెనక ఉన్న అసలు కారణం తెలిసి పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...

గతంలో ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు అత్తమామలు సరిగ్గా పలకరించలేదని తెలుపుతూ, అప్పటినుండి వారిపై క్రమేణ కోపం పెంచుకొని ఎలాగైనా అత్తమామలను కరెంట్ షాక్ తో చంపేస్తే తన మీదకు రాదని అలా చేసినట్లు తెలిపాడు.ప్రస్తుతం రమేష్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు