లక్ష్మీ దేవి అక్క అలక్ష్మి గురించి మీకు తెలుసా?

సాధారణంగా మనకు సంపద కలగాలంటే, పెద్ద ఎత్తున లక్ష్మీ దేవికి పూజలు నిర్వహిస్తారు.

ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి లక్ష్మీ కటాక్షం కలగాలంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలి.

లక్ష్మీదేవికి పూజలు చేయటం వల్ల మనం కోరుకున్న విధంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.ఇప్పటివరకు మనం లక్ష్మీదేవి గురించి ఎన్నో తెలుసుకున్నాం.

కానీ లక్ష్మీదేవికి ఒక అక్క ఉందని, తన పేరు అలక్ష్మి అనే విషయం బహుశా చాలా మందికి తెలియక పోవచ్చు.అలక్ష్మి అంటే ఎవరు ఆమె స్వభావం ఎటువంటిదో ఇక్కడ తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు రాక్షసులు సాగర మధనం చేస్తున్న సమయంలో సముద్రగర్భం నుంచి లక్ష్మీదేవి పుట్టిన సంగతి మనకు తెలిసిందే.కానీ సముద్రగర్భం నుంచి లక్ష్మీదేవి కన్నా ముందుగా అలక్ష్మి ఉద్భవించింది.

Advertisement
Interesting Facts About Lakshmi Devi Elder Sister Alakshmi, Ala Lakshmi, Pooja,

కనుక లక్ష్మీదేవికి అక్క అలక్ష్మి.ఇకపోతే సముద్రగర్భం నుంచి లక్ష్మీదేవి పుట్టగానే విష్ణుమూర్తి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తాడు.

కానీ లక్ష్మీదేవి తనని పెళ్లి చేసుకోవాలంటే తన కంటే ముందుగా పుట్టిన తన అక్క అలక్ష్మికి పెళ్లి చేయాలని చెబుతుంది.విష్ణుమూర్తి అప్పటినుంచి అలక్ష్మికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

అయితే తనను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు.ఎందుకంటే అంటే లక్ష్మీదేవి ఎప్పుడైతే కాలు పెడుతుందో అక్కడ సిరిసంపదలు కలుగుతాయి.

కానీ అలక్ష్మి ఎక్కడైతే కాలు పెడుతుందో అక్కడ పరమ దరిద్రం ఏర్పడుతుంది.

Interesting Facts About Lakshmi Devi Elder Sister Alakshmi, Ala Lakshmi, Pooja,
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

అందుకోసమే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు.ఈ విధంగా ఆమె కోసం వరుడిని వెతకగా చివరకు సంపదల మీద వ్యామోహం లేని ఒక మునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు.ఆతర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవి వివాహం చేసుకుంటారు.

Advertisement

లక్ష్మీదేవి విష్ణుమూర్తి వివాహం చేసుకోగానే సిరిసంపదలు వస్తాయి.ఉద్దాల‌కుడితో వెళ్లిన అల‌క్ష్మి ఆయ‌న ఇంట్లోకి వెళ్ల‌కుండా గుమ్మం దగ్గరే ఉంటుంది.

లోపలికి రమ్మని ఉద్దాలకుడు చెప్పగా అల‌క్ష్మి ఇంట్లో ఎంతో శుభ్రంగా ఉంది, ఈ విధంగా శుభ్రంగా ఉన్న ఇంట్లో తాను ఉండ‌న‌ని, మురికిగా, అప‌రిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఉంటానని తెలిపింది.అందుకే మన ఇంట్లో సుచి శుభ్రత లేకపోతేఅల‌క్ష్మి తిష్ట వేస్తుంది.

తద్వారా సిరిసంపదలు తరిగిపోయి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.

తాజా వార్తలు