ఫేస్‌బుక్ నాపై కక్ష కట్టింది - రక్షణ కల్పించండి!!

ఇదో వింత కేసు.

సాదారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్తితులలో, ముఖ్యంగా యువతలో ఫేస్‌బుక్ అంటే తెలియని వారు, అది ఉపయోగించని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

స్టేటస్ అప్‌డేట్స్, ఫోటోస్, లైక్స్, కామెంట్స్ ఇలా ఫేస్‌బుక్ వేదికగా యువత కిర్రెక్కిపోతున్నారు.ఫేస్‌బుక్ సైతం యువతను దృష్టిలో పెట్టుకునే తమదైన శైలిలో రోజు రోజుకు మార్పులు చేస్తూ తమ ప్రభంజనాన్ని, ప్రపంచానికి తెలియజేస్తుంది.

అలాంటి ఫేస్‌బుక్ ఒక యువకుడిపై కక్ష కట్టింది.ఫేస్‌బుక్ లో ఉన్న లోపాలను ఎత్తి చూపాడు హైదరాబాద్ కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై ఫేస్‌బుక్ యాజమాన్యం కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టడంతో చేసేది ఏమీలేక ఆయువకుడు పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసి కోర్ట్ కు పంపగా, న్యాయస్థానం దీనిపై విచారణ మొదలు పెట్టింది.

మరి కధ కంచికి ఎలా చేరుతుందో తెలియాలంటే మాత్రం మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement
చిప్స్ ఇష్టంగా తింటున్నారా..అయితే ఇది చదివితీరాల్సిందే....

తాజా వార్తలు